గురుకులంలో మంత్రి కొప్పుల తనిఖీలు

పెద్దపల్లి,అగస్టు1 జ‌నంసాక్షిః  జిల్లాలోని ధర్మారం మండలం నంది మేడారం గ్రామంలోని తెలంగాణ బాలుర గురుకుల విద్యాలయాన్ని సంక్షేమ శాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్‌ ఆకస్మికంగా తనిఖీ చేశారు. జ్వరంతో విద్యార్థులు అస్వస్థకు గురయ్యారనే సమాచారంతో మంత్రి సోమవారం అకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాల అంతటా కలియ తిరిగి విద్యార్థుల యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. స్వయంగా మంత్రి దగ్గరుండి విద్యార్థులకు వైద్య పరీక్షలు చేయించారు. వ్యక్తిగత పరిశుభ్రత పాటించాలని విద్యార్థులకు సూచించారు.