గురుకులాలతో విద్యకు ప్రాధాన్యం
ఆదిలాబాద్,నవంబర్8(జనంసాక్షి): అన్నివర్గాల సంక్షేమమే ధ్యేయంగా తెలంగాణ ప్రభుత్వం పని చేస్తుందని, నిరుపేద మైనార్టీల కోసం ప్రవేశ పెట్టిన గురుకుల పాఠశాలల్లో ప్రైవేట్‌కు దీటుగా విద్యా బోధన అందిస్తున్నామని రాష్ట్ర పాడి పరిశ్రమ అభివృద్ధి సహకార సమాఖ్య చైర్మన్, టీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యదర్శి లోక భూమారెడ్డి అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో విద్యా వ్యవస్థ గాడి తప్పిందన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత నిరుపేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందుతుందన్నారు. అభివృద్ధిలో మన జిల్లా వెనకబడినట్లు గుర్తించిన ముఖ్యమంత్రి కేసీఆర్ మైనార్టీ, దళిత, గిరిజన, బీసీల సంక్షేమం కోసం గురుకుల పాఠశాలలను కేటాయించారని పేర్కొన్నారు. ఆయా పాఠశాలల్లోని వసతులపై విద్యార్థులను అడిగి తెలుసుకొన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గానికి ఒకటి చొప్పున 122మైనార్టీ గురుకుల పాఠశాలలు మంజూరయ్యాయని, ప్రస్తుతం పది జిల్లాల్లో 71పాఠశాలలు ప్రారంభమైనట్లు ఆయన తెలిపారు. ఆయా గురుకుల పాఠశాలల్లో దాదాపు 14వేల మంది విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. మైనార్టీ గురుకులాల్లో ఏడాదికి ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.80వేలు ఖర్చు చేస్తున్నట్లు పేర్కొన్నారు.
బంగారు తెలంగాణలో విద్యార్థులు భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ పేద ప్రజల సంక్షేమానికి పాటు పడుతున్నారని, దేశంలో ఎక్కడా లేని పథకాలను ప్రవేశపెట్టిన ఘనత కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. జరుగుతున్న అభివృద్ధి పనులను చూసే పార్టీలోకి వలసలు పెరుగుతున్నాయని చెప్పారు