గురుకుల పాఠశాలను సందర్శించిన పుర చైర్మన్ ఎడ్మ సత్యం

కల్వకుర్తి నవంబర్ 27 జనం సాక్షి:
పట్టణ పరిధిలో నూతనంగా ఏర్పాటు చేసిన జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాలను ఆదివారం ఉదయం సందర్శించారు అక్కడ విద్యార్థులతో మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటు చేసిన గురుకుల పాఠశాలలో ఉన్న విద్యార్థుల సంఖ్య మరియు విద్యాబ్యాసం ఏవిధంగా ఉన్నదో అడిగి తెలుసుకున్నారు, ప్రస్తుతం పాఠశాలలో ఉన్న సమస్యలను తెలుసుకున్నారు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో బండోనిపల్లి సర్పంచ్ అంజయ్య, హాస్టల్ వార్డెన్ మరియు విద్యార్థులు పాల్గొన్నారు.
కష్ట పడితేనే ఉద్యోగ ఫలితాలు అనుకూలం
 : పుర చైర్మన్ ఎడ్మ సత్యం
కల్వకుర్తి పట్టణ పరిధిలో స్టేడియం గ్రౌండ్ యందు ఆదివారం కే.ఐ. పి ఇన్స్టిట్యూట్ ఆధ్వర్యంలో ఎసై మరియు కానిస్టేబుల్ మాక్ ఈవెంట్స్ నిర్వహించారు ఈ కార్యమాన్ని ముఖ్య అతిథిగా పుర చైర్మన్ ఎడ్మ సత్యం పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద మధ్య తరగతి విద్యార్థులకు శిక్షణలు అందిస్తూ కే ఐ పి ఇన్స్టిట్యూట్ వారికి అండగా నిలిచిందన్నారు అలాగే ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉద్యోగ అవకాశాలు సద్వినియోగం చేసుకోవాలన్నారు కష్టపడితేనే ఉద్యోగ ఫలితాలను పొందుతారని వారు తెలిపారు. ఇన్స్టిట్యూట్ డైరెక్టర్ కె.నవీన్ కుమార్ మాట్లాడుతూ ఎసై, కానిస్టేబుల్ మాక్ ఈవెంట్స్ విజయవంతం అయ్యాయని తెలిపారు, అలాగే కల్వకుర్తి మినీ స్టేడియలో నిర్వహించిన మాక్ ఈవెంట్స్ కి SI, కానిస్టేబుల్ అభ్యర్థులు 175మంది పాల్గొన్నారు. ఇందులో అమ్మాయిల విభాగంలో 800మీ//పరుగుపందెంలో మాధవి 3ని//20.సె మరియు కవిత 3ని//31సె. అబ్బాయిల విభాగంలో 1600మీ పరుగుపందెంలో Y. మల్లేష్ 5ని//20సె//, V. ఆనంద్ 5ని//40సె// ప్రథమ, ధ్వితీయ బహుమతులను గెలుచుకున్నారు. ఈ కార్యక్రమాన్ని కల్వకుర్తి పట్టణ CI శ్రీ సైదులు   మరియు మున్సిపల్ చైర్మన్ శ్రీ యడ్మ సత్యం   ప్రారంభించారని వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో గణేష్ ,మల్లేష్, వినోద్, శ్రీను, కృష్ణ, భాను, పాండు తదితరులు పాల్గొన్నారు.