గురుదాస్‌పూర్‌ దాడి వెనుక పాక్‌ హస్తం

3

– లోక్‌సభలో రాజ్‌నాథ్‌ సింగ్‌

న్యూఢిల్లీ,,జులై31(జనంసాక్షి):

పంజాబ్‌లోని గురుదాస్‌పూర్‌లో దాడిచేసిన ఉగ్రవాదులు పాకిస్తాన్‌ నుంచే వచ్చారని కేంద్ర ¬ంమంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌ స్పష్టం చేశారు. ఈ ఘటన వెనక పాక్‌ ఉందని ఆయన అన్నారు. ఉభయసభల్లో శుక్రవారం కూడా గందరగోళం చెలరేగగా సోమవారానికి వాయిదా పడ్డాయి. ఇక ఉగ్రదాడి ఘటనపై శుక్రవారం లోక్‌సభలో రాజ్‌నాథ్‌  ప్రకటన చేశారు. మిలిటెంట్ల నుంచి మూడు ఏకె 47, 19 తుపాకులు, జీపీఎస్‌ సామాగ్రి, మ్యాగజైన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు ఆయన వివరించారు. ఉగ్రవాదులతో వీరోచితంగా పోరాడి ప్రాణాలు పోగొట్టుకున్న పోలీసులకు ఆయన నివాళి ఆర్పించారు. పంజాబ్‌ పోలీలుసు సాహసోపేతంగా పోరాడారని అన్నారు.  ఉగ్రవాదులు జమ్మూ – పాటన్‌ కోట్‌ రైలు మార్గంలో ఐదు మందు పాతరలు కూడా అమర్చారని రాజ్‌నాథ్‌ సింగ్‌ వెల్లడించారు. భారత్‌ను తక్కువగా అంచనా వేయవద్దని ఆయన హెచ్చరించారు. గతంలో యుపిఎ హయాంలో ఆనాటి ¬ం మంత్రి చిదంబరం హిందూ ఉగ్రవాదం అన్న కొత్త పదం సృష్టించాడని కేంద్ర ¬ం మంత్రి రాజ్‌ నాద్‌ సింగ్‌ విమర్శించారు. దీనివల్ల ఉగ్రవాదం పై పోరులో భారత్‌ వెనుకబడిందేమోనన్న భావన ఏర్పడిందని ఆయన అన్నారు. ఉగ్రవాదం అంటే ఉగ్రవాదమేనని, అందులో కులం,మతం,ప్రాంతం రంగులు ఉండవని అన్నారు. చిదంబరాన్ని ఉగ్రవాది హఫీజ్‌ సయ్యద్‌ ప్రశంసించారంటే నే పరిస్థితిని అర్దం చేసుకోవచ్చని అన్నారు.దేశం ఎదుర్కుంటున్న అది పెద్ద సమస్య ఉగ్రవాదమని, దీనిని ఎదుర్కోవడానికి ప్రజలంతా ఏకతాటిపై ఉండాలని,ఇందులో విబేదాలకు తావు లేదని ఆయన స్పష్టం చేశారు.దీనిపై ఎలాంటి సమాధానం చెప్పడానికి అయినా సిద్దమేనని ఆయన అన్నారు. ఉగ్రవాద అంశాలపైనా పార్లమెంటులో విభేదించడం దారుణమన్నారు.  అయితే పార్లమెంటు సమావేశాలు ప్రభుత్వమే జరగనీయడం లేదని కాంగ్రెస్‌ నేతలు చెప్పడం దారుణమని కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు అన్నారు. పార్లమెంటు సమావేశాలు తరుచూ వాయిదా పడుతుండటంపై ఆయన ఆవేదన ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం దిల్లీలో ఆయన విలేకరులతో మాట్లాడారు. పార్లమెంటు సమావేశాలు సక్రమంగా నిర్వహించాలని ప్రభుత్వం యోచిస్తుంటే ప్రతిపక్షాలు సహకరించడం లేదన్నారు. కాంగ్రెస్‌ హయాంలో పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లులనే ఇప్పుడు ఆ పార్టీ వ్యతిరేకిస్తోందని… కాంగ్రెస్‌ దిగజారుడుతనానికి ఇది నిదర్శమని మండిపడ్డారు. జీఎస్‌టీ బిల్లు లోక్‌సభలో ఏకగ్రీవ ఆమోదం పొందిందని.. రాజ్యసభలో బిల్లు ఆమోదానికి ప్రతిపక్షాలు అడ్డుపడుతున్నాయన్నారు. జీఎస్‌టీ ఆమోదం పొందితే దేశాభివృద్ధికి ఎంతో

ఉపయోగపడుతుందని చెప్పారు. మోదీ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ కార్యకలాపాలకు ప్రజల నుంచి విశేష స్పందన వస్తోందని.. దానిని ఓర్వలేకే కాంగ్రెస్‌ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందన్నారు. దేశానికి సంబంధించిన ఏ అంశంపైన అయినా పార్లమెంటులో చర్చించేందుకు తమ ప్రభుత్వం సిద్ధంగా ఉందని వెంకయ్యనాయుడు స్పష్టం చేశారు. ఇక లలిత్‌ మోదీ, వ్యాపం కుంభకోణంపై విపక్షాల ఆందోళనల మధ్య పార్లమెంట్‌ సోమవారానికి వాయిదా పడింది. ఆరోపణలు ఎదుర్కొంటోన్న మంత్రులు, ముఖ్యమంత్రులు రాజీనామాలు చేయాలంటూ ప్రతిపక్ష సభ్యులు ఆందోళన కొనసాగించారు. నినాదాలు చేస్తూ ప్లకార్డులు ప్రదర్శించారు. సభ్యుల వైఖరిపై పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ఎం.వెంకయ్యనాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. సభ్యులు చర్చకు అంగీకరించకుండా సభలో కార్యకలాపాలను అడ్డుకోవడంపై లోక్‌సభ స్పీకర్‌ సుమిత్రా మహాజన్‌ ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజ్యసభలోనూ ఇద