*గుర్తు తెలియని మృతదేహం వరద కెనాల్ లో లభ్యం*
బాల్కొండ అక్టోబర్ 10 ( జనం సాక్షి ) నిజామాబాద్ జిల్లా బాల్కొండ మండలం బస్సాపూర్ గ్రామ శివారు లోని వరద కెనాల్ లో గుర్తు తెలియని మగ శవం కొట్టుకు రాగ దానిని బస్సాపూర్ గ్రామస్థులు గుర్తించి పోలీస్ లకు సమాచారం ఇవ్వగ సంఘటన స్థలానికి చేరుకొని గుర్తు తెలియని మృతదేహాన్ని వెలికి తీసి అక్కడే పోస్ట్ మార్టం జరిపించినారు, ఇట్టి మృతదేహం గుర్తులు కుడిచేయి పై “సంజ ” అని పేరు పచ్చ బొట్టు తో కలదు,ఎడమ చేయి పై “ఎల్లయ్య ” అని పెద్ద అక్షరాల తో పచ్చ బొట్టు పేరు కలదు
ఇట్టి విషయం పై, ఏ ఎసై శంకర్ బాల్కొండ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు.