గుర్రంగట్టు తాండ, కుడు గుంట గ్రామాల్లో మీతో నేను కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే మెతుకు ఆనంద్.

మర్పల్లి జులై 12 (జనం సాక్షి) గ్రామాలలో అన్ని వీధుల్లో థర్డ్ వైర్ ఏర్పాటు చేయాలని, గ్రామాల చుట్టు పక్కల్లో వేలాడుతున్న విద్యుత్ వైర్లను సరిచేయాలని, పాత విద్యుత్ స్తంభాలను మార్చాలని, రోడ్డు మధ్యలో ఉన్న స్తంభాలను తొలగించి కొత్త  స్తంభాలను ఏర్పాటు  చేయాలని, కుడుగుంట గ్రామంలో కొత్త ట్రాన్స్ఫర్మర్ ఏర్పాటు చేయాలని మండల విద్యుత్ అధికారులకు ఆదేశించిన ఎమ్మెల్యే మెతుకు ఆనంద్. మంగళవారం గుర్రంగట్టు తాండ, కుడుగుంట గ్రామాల్లో మీతో నేను కార్యక్రమంలో పాల్గొన్న వికారాబాద్ ఎమ్మెల్యే మెతుకు ఆనంద్ వీధులలో తిరుగుతూ ప్రజలకు ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మాట్లాడుతూ వర్షాకాలం ప్రారంభం అయ్యిందని, గ్రామంలో ప్రతి ఒక్కరు పరిసరాలను శుభ్రంగా ఉంచుకొని  తగు జాగ్రత్తలు పాటించాలని అన్నారు.  సదరన్ క్యాంపులు ఏర్పాటు చేసి అర్హులైన వారికి సదరం సర్టిఫికేట్ చేయాలని ఉన్నత అధికారులు ఆదేశించారు. గుర్రంగట్టు తాండలోని రేషన్ సరఫరా చేయాలని అధికారులు ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి మధుకర్, వైస్ ఎంపీపీ మోహన్ రెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు నయబ్ గౌడ్, ఎంపీటీసీ రవీందర్, సర్పంచులు సోనీ బాయి, ఉమా గోపాల్ రెడ్డి, మండల అధికారులు, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు శ్రీకాంత్ రెడ్డి, పలు గ్రామాల సర్పంచులు, ఎంపీటీసీలు, తదితరులు పాల్గొన్నారు