గుర్రాల రేణుక విద్యుత్ షాక్‌తో మృతి
మెదక్: మెదక్ జిల్లా వర్గల్ మండలం పాతూరు గ్రామంలో ఈ రోజు ఉదయం విద్యుదాఘాతంతో ఓ యువతి మృతిచెందింది. గుర్రాల రేణుక అనే యువతి ఇంట్లో బట్టలు ఆరేస్తుండగా విద్యుదాఘాతానికి గురై తీవ్రంగా గాయపడింది. చికిత్స నిమిత్తం కుటుంబసభ్యులు ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలోనే మృతి చెందింది.