గుర్రాల హన్మిరెడ్డి ఆశయాల బాటలొ సాగుదాం

పెట్టుబడి దారుల రాజ్యం కుల్చూదాం.
సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ డిమాండ్.
 హుస్నాబాద్ రూరల్ ఆగస్టు 29(జనంసాక్షి) సిపిఐ మాజీ జిల్లా కౌన్సిల్ సభ్యులు అమరజీవి గుర్రాల హన్మిరెడ్డి 2వ వర్ధంతి సందర్భంగా సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి,సింగిరెడ్డి,అమరుల భవన్ లో ఏర్పాటు చేసిన వర్ధంతి సభకు హాజరైన సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు హుస్నాబాద్ మాజీ వైస్ ఎంపిపి గడిపె మల్లేశ్ ఆయన చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం గడిపె మల్లేశ్ మాట్లాడుతూ గుర్రాల హన్మిరెడ్డి పోరాట స్ఫూర్తితో‌ దొపిడి,పెట్టుబడి దారుల రాజ్యం కుల్చూదామని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపే మల్లేశ్ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. గుర్రాల హన్మిరెడ్డి ఆశాయల సాధన కోసం నేటి యువత ముందుకు రావాలని కోరారు. ఈకార్యక్రమంలో సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు అయిలేని సంజివరెడ్డి,బైరగోని సరోజన,ఎఐవైఎఫ్ జిల్లా ఉపాధ్యక్షుడు జనగాం రాజు కుమార్,ఎఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి గడిపె సుజిత్ కుమార్,సిపిఐ మండల నాయకులు అయిలేని మల్లారెడ్డి,ఎండి అక్బర్, ఎఐఎస్ఎఫ్ జిల్లా నాయకులు తరిగోప్పుల హరిక, యెడబొయిన సంతోష్ ,మిడిదొడ్డి సాయి, తదితరులు పాల్గొన్నారు.