గృహలక్ష్మి పథకంతో పేదల సొంతింటి కల సాకారం : మంత్రి మల్లారెడ్డి
గృహలక్ష్మి పథకంతో పేదల సొంతింటి కల సాకారం : మంత్రి మల్లారెడ్డి
బీఆర్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన గృహక్ష్మి పథకంతో నిరుపేదలకు సొంతింటి కల సాకారం అవుతుందని కార్మికశాఖ మంత్రి చామకూర మల్లారెడ్డి అన్నారు. మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా కలెక్టరేట్ గృహలక్ష్మి పథకానికి ఎంపికైన లబ్ధిదారులకు మంత్రి మంజూరు పత్రాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహలక్ష్మి పథకంఇళ్లు లేని నిరుపేదలకు వరంగా మారిందని, ముఖ్యమంత్రి కేసీఆర్ నిరుపేదలకు మంచి చేయాలనే ఉద్దేశంతో ఈ పథకాన్ని రూపొందించినట్లు చెప్పారు.
ఖాళీ స్థలం ఉండి ఇళ్లు లేని అర్హూలైన నిరుపేదలందరికి గృహలక్ష్మి పథకం కింద రూ.3 లక్షలను అందించేందుకు ప్రభుత్వం సహకరిస్తుందని, ఈ విషయంలో ఎవరు ఆందోళన చేందాల్సిన అవసరం లేదన్నారు. ప్రస్తుతం మొదటి విడతలో 8 వందల మంది లబ్ధిదారులకు గృహలక్ష్మి ఉత్వర్వులను అందించామని, త్వరలోనే మరో విడతతో మరింత మంది లబ్ధిదారులకు అందజేస్తామన్నారు.
గృహలక్ష్మి పథకం లబ్ధిదారులు ఇంటి నిర్మాణ పనులు చేపట్టాలని మంత్రి మల్లారెడ్డి కోరారు. పనులు ప్రారంభమైతే లబ్ధిదారుల ఖాతాలలో ప్రభుత్వం డబ్బులను జమ చేస్తుందని పేర్కొన్నారు. ఖాళీ స్థలం, ప్లాట్ ఉన్న ప్రతి ఒక్కరూ గృహలక్ష్మి పథకానికి దరఖాస్తులు చేసుకోవచ్చని చెప్పారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు, మేయర్లు, మున్సిపల్ ఛైర్మన్లు, సర్పంచులు, కౌన్సిలర్లు ప్రజలకు సహకరించి వారికి సంబంధించిన దరఖాస్తులను అధికారులకు అందజేయాలని మంత్రి మల్లారెడ్డి పేర్కొన్నారు.