గృహ నిర్మాణ శాఖపై ముఖ్యమంత్రి సమీక్ష

హైదారాబాద్‌: గృహ నిర్మాణశాఖపై ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌ రెడ్డి ఉన్నతాధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. హౌసింగ్‌ స్కీం కింద బీసీ, ఓసీలకు యూనిట్‌ కాస్ట్‌ను రూ.70 వేలకు పెంచాలని ప్రభుత్వం నిర్ణయించింది. గ్రామీణ ప్రాంతాల్లో రూ.45 వేల నుంచి 70వేలకు పట్టణన ప్రాంతాల్లో రూ.55 వేల నుంచి రూ.80వేలకు పెంచాలని నిర్ణయం తీసుకుంది. రాజీవ్‌ స్వగృహకు రూ.105 కోట్లు ఇవ్వాలని నిర్ణయించింది.