గెల్లు శ్రీనివాస్‌పై నోరు పారేసుకోవడం తగదు
ఈటెల క్షమాపణలు చెప్పాలన్న రమణ
జగిత్యాల,అగస్టు12(జనం సాక్షి): హుజురాబాద్‌లో బీసీ బిడ్డ గెల్లు శ్రీనివాస్ యాదవ్‌ను టీఆర్‌ఎస్ అభ్యర్థిగా సీఎం ప్రకటిస్తే ఈటల బీసీలను బానిసలు అని మాట్లాడడం తగదని టీఆర్‌ఎస్ నేత ఎల్ రమణ అన్నారు. వెంటనే ఈటల రాజేందర్ బీసీలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. ఇటీవలే టీఆర్‌ఎస్ పార్టీలో చేరిన ఎల్.రమణను జగిత్యాలఎమ్మెల్యే డాక్టర్ సంజయ్, జడ్పీ, మున్సిపల్ చైర్ పర్సన్లు ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా రమణ మాట్లాడుతూ.. మూడోసారి టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చేలా రాష్ట్ర రాజకీయాల్లో కీలక పాత్ర పోషిస్తానని తెలిపారు. హుజురాబాద్ ఉప ఎన్నికల్లో టీఆర్‌ఎస్ కార్యకర్తలు సైనికుల్లా పనిచేసి
గెల్లును గెలిపించాలని పిలుపునిచ్చారు.