గొట్టిముక్కల ఆలయంలో ఘనంగా హనుమజ్జయంతి

శివంపేట : మండలంలోని చిన్నగొట్టిముక్కల గ్రామం సహకార అంజనేయ స్వామి ఆలయంలో హనుమజ్జయంతి, విగ్రహాల, ప్రతిష్ఠాపనోత్సవాలు నిర్వహించారు. మూడు రోజుల నుంచి నిర్వహిస్తున్న ఈ ఉత్సవాలకు వివిధ ప్రాంతాల నుంచి వేలాదిమంది భక్తులు హాజరయ్యారు. సోమవారం రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి బన్వర్‌లాల్‌ కుటుంబీకులతో సహా హాజరై స్వామికి పూజలు నిర్వహించారు. వ్రతదొర రామానుజజీయర్‌ స్వామీజీ, మాధవానంద సరస్వతి స్వామీజీల సమక్షంలో ఈ కార్యక్రమాలు నిర్వహించారు. సిద్దిపేట ఎమ్మెల్యే హరీష్‌రావు, ఎల్లారెడ్డి ఎమ్మెల్యే రవీందర్‌రెడ్డి స్వామిని దర్శించుకున్నారు.