గొర్రెలకు, మేకలకు నట్టల మందులు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించిన కార్పొరేటర్

వరంగల్ మహా నగరం 42 వడివిజన్లోని యాదవులు అందరూ కూడా గొర్రెలకు, మేకలకు నట్టల మందు లను వేసే అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కార్పొరేటర్ గుండు చందన పూర్ణచందర్అన్నారు.డివిజన్లోని రంగ సాయి పేట పశు వైద్యశాల వైద్యాధికారి డాక్టర్ ఝాన్సీఆధ్వర్యంలో మేకలకు, గొర్రెలకు నట్టల మందు వేసే కార్యక్రమాన్ని డివిజన్ కార్పొరేటర్  చందన పూర్ణచందర్ బుధవారం ప్రారంభించినారు.
           ఈ సందర్భంగా  చందన పూర్ణచందర్ మాట్లాడుతూ వేసవికాలం నుండి వర్షాకాలంకు మారినందున మేకలకు, గొర్రెలకు రోగాలు వచ్చే ప్రమాదం ఉన్నందున, రోగాల బారిన పడకుండా ఉండటానికి ప్రభుత్వం ద్వారా ఉచితంగా నట్టల మందులు వేసే కార్యక్రమాన్ని తీసుకున్నదని, ఈ అవకాశాన్ని డివిజన్లోని యాదవులు అందరూ కూడా సద్వినియోగం చేసుకొని గొర్రెలకు, మేకలకు నట్టల మందులు వేయించాలని కోరారు.
          ఈ కార్యక్రమంలో వైద్యాధికారి డాక్టర్ ఝాన్సీ, స్థానిక పెద్దలు దామరకొండ కరుణాకర్, కన్నెబోయిన కుమార్ యాదవ్, పశు వైద్యశాల సిబ్బంది, స్థానిక పెద్దలు తదితరులు పాల్గొన్నారు.