గొర్రెల కాపరుల ధర్నా
ఎలిగేడు: మండలంలోని నర్సాపూర్‌లో గొర్రెల కాపరి మేదరవేని లస్మయ్యపై జరిగిన దాడికి నిరసనగా గురువారం గొర్రెల కాపరులు, యాదవసంఘం ఆధ్వర్యంలో ఎలిగేడు తహశీల్దారు కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. దాడి చేసి కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. అనంతరం రెవెన్యూ పరిశీలకుడు శ్రీనివాస్‌కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో యాదవసంఘం మండలాధ్యక్షుడు చంద్రశేఖర యాదవ్, నాయకుల శ్రీనివాస్, రాజు, తిరుపతి, గంగయ్యలతో పాటు 50మంది గొర్రెల కాపరులు పాల్గొన్నారు.