గోదావరి`కావేరి నదుల అనుసంధానం
జలసౌధలో ప్రారంభమైన సమావేశం
హైదరాబాద్,అక్టోబర్29 ( జనం సాక్షి ) గోదావరి`కావేరి నదుల అనుసంధానంపై సమావేశం ప్రారంభమైంది. హైదరాబాద్‌లోని జలసౌధలో జాతీయ జలవనరుల అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ సమావేశం జరుగుతున్నది. గోదావరి`కావేరి అనుసంధానంపై సంప్రదింపుల్లో భాగంగా తెలంగాణ, ఏపీ సహా ఎనిమిది రాష్టాల్ర అధికారులు పాల్గొన్నారు. ఈ సమావేశానికి తెలంగాణ నుంచి ఈఎన్సీ మురళీధర్‌రావు, ఇంజినీర్లు హాజరయ్యారు. ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఛత్తీస్‌గఢ్, కర్ణాటక, తమిళనాడు, పుదుచ్చేరి, కర్ణాటక, కేరళ రాష్టాల్రకు సంబంధించిన అధికారులు ఆన్లైన్ ద్వారా పాల్గొన్నారు.