గోదావరిఖనిలో కాంట్రాక్టు కార్మికుడి ఆత్మహత్యాయత్నం

గోదావరిఖని: కరీంనగర్‌ జిల్లా గోదావరి ఖనిలో కాంట్రాక్టు కార్మికుడు హరీష్‌ ఈ రోజు మధ్యాహ్నం ఎన్టీపీసీ సర్వీస్‌ భవనం పైకి  ఎక్కి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరిస్తున్నాడు. అధికారులు వాహనాన్ని పంపారు. హరీష్‌ కుటుంబసభ్యులను అక్కడికి రప్పించేందుకు అధికారులు వాహనాన్ని పంపారు. భవనం చుట్టూ వలలను ఏర్పాటు చేస్తున్నారు. పోలీసులు, భద్రతా సిబ్బంది అక్కడికి చేరుకుని కారణాలు తెలుసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. కానీ ఆత్మహత్యాయత్నానికి కారణాలు తెలియలేదు.