గోదావరిలో ముగ్గురు గల్లంతు

మంచిర్యాల: గోదావరిలో ముగ్గురు వ్యక్తులు గల్లంతైన విషాద సంఘటన మంచిర్యాల జిల్లాలో చోటుచేసుకుంది. బెల్లంపల్లిలోని ఏఎంసీ ఏరియాకు చెందిన అనిల్, వేణు, మహేష్ అనే ముగ్గురు వ్యక్తులు ఈత కొట్టేందుకు ముల్కల్ల దగ్గర గల గోదావరి నదిలోకి దిగారు. అయితే… ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి ముగ్గురూ గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారుల బృందం సంఘటనా స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్లతో గాలింపు చర్యలు చేపట్టారు. కాగా… ముగ్గురి గల్లంతుతో వారి కుటుంబాల్లో తీరని విషాదం నెలకొంది.