గోదావరి జలాల సాధనకై సీపీఎం పోరు యాత్రను జయప్రదం చేయండి

 సీపీఎం మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు
మోత్కూరు ఆగస్టు 17 జనంసాక్షి : మూసీ జల కాలుష్యం నుండి విముక్తి చేసి, గోదావరి,కృష్ణ, జలాలను అందించాలని డిమాండ్ చేస్తూ, ఈ నెల 21 నుండి 28 వరకు జరిగే సీపీఎం పార్టీ పోరు యాత్రను జయప్రదం చెయ్యాలని, సీపీఎం పార్టీ మండల కార్యదర్శి గుండు వెంకటనర్సు కోరారు. బుదవారం రోజున మోత్కూరు మండలం పాలడుగు గ్రామంలో పోరు యాత్రకు సంబందించిన కరపత్రాలను విడుదల చేసి, ఆయన మాట్లాడుతూ మూసీ నీళ్లలో కంపినీలలోని వ్యర్థ పదార్థాలను మూసీలో వదలడంతో అత్యంత ప్రమాదకరమైన నీరుగా మారిందని, ఆ నీరు బీమలింగం కత్వ ద్వారా వెల్వర్తి, పలేర్ల, కూరెళ్ళ, మీదుగా పాలడుగు చెరువులోకి వస్తున్నాయని, పాలడుగు చేర్వు నుండి దత్తప్పగూడెం, ముషిపట్ల గ్రామంలోని కొంత బాగం దాదాపు వందల ఎకరాలు సాగు ఐతునప్పటికి, నీరు విషపూరితంగా ఉండటంతో మనుష్యులు కడుకునుటకు కానీ, పశువులు త్రాగతానికికాని వీలులేని పరస్థితి ఉందని, చెరువులోని చేపలు, మరియు భూగర్భ జలాలు కరుషితమై ప్రజలు రోగాలబారిన పడుతున్నారని అన్నారు. మూసీ జలకాలుస్యం నుండి విముక్తి చేసి, బస్వాపురం ప్రాజెక్ట్ నుండి ఎర్రబెల్లి మీదుగా పహిల్మాన్ పరం చెరువును, రిజర్వాయర్ గా చేసి, వెల్వర్థి, పలెర్ల, కూరెళ్ల,నుండి పాలడుగు చెర్వు లోకి, మరియు బునాధిగానీ కాల్వను పూర్తిచేసి, ఆత్మకూరు, మోత్కూరు, అడ్డగూడూర్, మండలాలకు సాగు, త్రాగు నీరు అందించే అవకాశం ఉందని, ఈ నీరు సాధన కోసం ఈనెల 21 నుండి 28 వరకు జరిగే సీపీఎం పార్టీ పోరు యాత్రలో ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చెయ్యాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఎం పార్టీ మండల కమిటీ సభ్యులు దడిపల్లి ప్రభాకర్, శాఖ కార్యదర్శి పిట్టల చంద్రయ్య, సహాయ కార్యదర్శి చింతకింది సోమరాజు, వడ్డేపల్లి లక్ష్మణ్, లక్ష్మి, సైదులు, కొంపల్లి గంగయ్య, విజయ, యశోద, తదితరులు పాల్గొన్నారు.
 

తాజావార్తలు