గోల్డ్‌మెన్ దారుణహత్య
పుణె,జులై 15(జనంసాక్షి):పసిడి చొక్కా, ఒంటి నిండా బంగారంతో అందరి దృష్టిని ఆకర్షించిన పుణెకు చెందిన ‘గోల్డ్‌మెన్’ దత్తాత్రేయ పుగే హత్యకు గురయ్యాడు. శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు ఆయనను హత్య చేశారు. రాళ్లతో కొట్టి, పదునైన ఆయుధాలతో దాడి చేయడంతో ఆయన మృతి చెందినట్టు పోలీసులు తెలిపారు. వక్రతుండ చిట్‌ఫండ్ పేరుతో పలువురి నుంచి డబ్బులు సేకరించి ఆయన అక్రమాలకు పాల్పడినట్టు గతంలో దత్తాత్రేయపై కేసులు నమోదయ్యాయి. ఆర్థిక అక్రమాల నేపథ్యంలోనే ఆయనను హత్య చేసివుంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. భొసరి ప్రాంతంలోని తమ ఇంటికి గురువారం అర్ధరాత్రి కొత్తమంది వచ్చి తన భర్తను తీసుకెళ్లారని దత్తాత్రేయ భార్య సీమా తెలిపారు. దిగిహి సవిూపంలోని భారతమాత నగర్కు తీసుకెళ్లి తన భర్తను హత్య చేశారని వెల్లడించింది. నేషనలిస్ట్ కాంగ్రెస్ తరపున గతంలో కార్పొరేటర్గా ఆమె పనిచేసింది. హంతకులను పట్టుకునేందుకు పోలీసులు రంగంలోకి దిగారు. 22 క్యారెట్ల బంగారంతో తయారు చేసిన 3.5 కిలోల బరువున్న చొక్కా ధరించడంతో దత్తాత్రేయ పుగే వార్తల్లో నిలిచారు. ఒంటినిండా బంగారం ధరించి అందరి దృష్టిని ఆకర్షించారు. పుట్టిన రోజు వేడుకలకని ఆహ్వానించి.. కన్న కొడుకు కళ్ల ముందే దత్తాను కిరాతకంగా రాళ్లతో కొట్టి, కత్తితో పొడిచి హత్య చేశారు. అదృష్టవశాత్తు దుండగుల బారి నుంచి ఆయన కుమారుడు తప్పించుకున్నాడు. పింప్రి-చించ్వాడ్ ప్రాంతానికి చెందిన దత్తాత్రేయ స్థానికంగా చిట్‌ఫండ్ వ్యాపారం చేస్తుంటాడు. బంగారం విూద మోజుతో ఆభరణాలు ధరించడమే కాక బంగారు షర్టు కూడా కుట్టించుకున్న అతడిని అందరూ గోల్డ్‌మ్యాన్ దత్తాగా పిలిచేవారు. గురువారం రాత్రి 11.30 సమయంలో దత్తా, ఆయన కుమారుడిని ఓ వ్యక్తి పుట్టినరోజు వేడుకలకు ఆహ్వానించాడు. దత్తా అక్కడకు వెళ్లగానే దాదాపు 12 మంది దుండగులు ఆయనపై దాడి చేసి హత్య చేశారు. అతడి కుమారుడు.. దుండగుల నుంచి తప్పించుకున్నాడు. దత్తా భార్య పింప్రి-చించ్వాడ్ మాజీ కార్పొరేటర్. ఆర్థిక వ్యవహారాల కారణంగానే దత్తాను హత్య చేసి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ఘటనకు సంబంధించి నలుగురు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రూ. 1.27కోట్లతో 3.5కేజీల బంగారు చొక్కాను ధరించి 2012లో దత్తా అందరి దృష్టిని ఆకర్షించిన విషయం తెలిసిందే.