గోవుల తరలింపును అడ్డుకున్న వీహెచ్‌పీ కార్యకర్తలు
హైదరాబాద్ : మెదక్ జిల్లా సిద్దిపేట నుంచి హైదరాబాద్‌లోని ఎర్రగడ్డకు 30 ఆవులు, లేగ దూడలను డీసీఎంలో తరలిస్తుండగా విశ్వహిందూ పరిషత్, గోసంరక్షణ సమితి సభ్యులు అడ్డుకుని పోలీసులకు అప్పగించారు. జంతు హింస చట్టం కింద పోలీసులు కేసు నమోదు చేశారు. డీసీఎం డ్రైవరుతోపాటు మరో వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.