గౌడన్నల మద్దతు మరచిపోలేనిది
అనేక సంక్షేమ పథకాలతో కెసిఆర్ ఆదుకుంటున్నారు
మరోమారు ఆశీర్వదిస్తే అభివృద్దిని కొనసాగిస్తా :ఆరూరి రమేశ్
వరంగల్,సెప్టెంబర్29(జనంసాక్షి): వర్ధన్నపేట నియోజవర్గం లోని గౌడన్నల ప్రేమ మరిచిపోలేని విధంగా ఉందని వర్ధన్నపేట మాజీ ఎమ్మెల్యే అరూరి రమేష్ అన్నారు. వరంగల్ రూరల్ జిల్లా వర్ధన్నపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన గౌడ సంఘం సమావేశంలో పాల్గొన్న ఆరూరి రమేష్ మాట్లాడుతూ 2014 లో కేసీఆర్ ఆశీర్వాదంతో వర్ధన్నపేట నియోజవర్గం లో అనేక సంక్షేమ పథకాలు అమలుచేశానని అన్నారు. అలాగే 2018 లో రెండవసారి అవకాశం కల్పిస్తే నియోజవర్గంలో పెద్ద మొత్తంలో అభివృదద్‌ఇ చేసే అవకాశం ఉందన్నారు. గౌడన్నలు చూపెడితున్న అదరాభిమానలు మరువలేనివంటూ పేరుపేరున ధన్యవాదాలు తెలిపారు. అలాగే అధిక భాగం గౌడ అన్నలకు అధిక ప్రాధాన్యం కల్పిస్తున్నామని అన్నారు. కేసీఆర్ తెలంగాణ ఏర్పాటు తర్వాత గౌడాన్న చనిపోతే 5 లక్షల నష్ట పరిహారం అందిస్తున్నట్లు వెల్లడించారు. మిగిలిన సమస్యలను కేసీఆర్ ,కేటీఆర్ దృష్టికి తీసుకెళ్ళి గౌడ కులస్తులు సమస్యలపై మాట్లాడుతనని తెలిపారు. గత ఎన్నో ఎండ్లా పాటు అనేక రాజకీయ పార్టీలు అధికారంలో ఉన్నా,ఎవరు కూడా కుల వృత్తులకు పట్టించుకోలేదని విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం లో 200 ,వికలాంగులు500 పెన్షన్ లు ఉండేవి కానీ తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు తర్వాత 1000,1500 లకు పెంచారు.రేపు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు 2000 ఇస్తామని ఇప్పుడు అంటున్నారు కాని అప్పుడు ఏమైంది అని ఉత్తమ్ కుమార్ రెడ్డిని విమర్శించారు. ఎన్నికల్లో హావిూలు ఇవ్వని అనేక సంక్షేమ పథకాలు కల్యాణ లక్ష్మి,షాది ముబారక్ ,చెక్కుల పంపిణీ చేస్తుంది. గతంలో పాలించిన కాంగ్రెస్ పార్టీ కి సోయ్ ఉందా అని అన్నారు
.రెక్కాడితే కాని డొక్కాడని నిత్యం పని చేసుకొని వారి కోసం అనేక పథకాలు అందిస్తుంది.కేసీఆర్ కిట్ లతో పాటు ఉచిత డెలివరీ,డబ్బులు కూడా ఇస్తున్న ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వం అని తెలిపారు. ప్రతి పేద విద్యార్థుల కోసం అనేక గురుకుల పాటశాల ఏర్పాటు చేసి నాణ్యమైన విద్య,సన్నబియ్యం పెడుతున్న ప్రభుత్వం తమదని అన్నారు. ఆడపిల్లల కోసం ప్రత్యేక హైజానిక్ కిట్ ల పంపిణీ,అంతేకాక కంటి పరీక్షలు ద్వారా కంటి వెలుగులు అందిస్తున్నాం అని అన్నారు. ప్రతి ఇంటికి గోదావరి నీళ్లను అందించేందుకు మిషన్ భగీరథ కార్యక్రమం చేస్తుంది.సుమారు 415 సంక్షేమ పథకాలు ప్రవేశ పెట్టిన ఘనత కేసీఆర్ ది .తెలంగాణ ఏర్పాటు తర్వాత ఉచిత విద్యుత్ 24 గంటల పాటు ఇస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం అని అంతే కాక బ్యాంక్ రుణమాఫీ ,పెట్టుబడి కోసం పెట్టుబడి చెక్కుల పంపిణీ తో పాటు రైతులు ప్రమాదాలు జరుగుతే 5లక్షల ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పిస్తున్న ప్రభుత్వం కేసీఆర్ ప్రభుత్వం.అన్ని గ్రామాల్లో అంతర్గత సి సి రోడ్లను నిర్మించాడని ప్రయత్నం చేస్తున్నాం.ఆకేరు వాగు పై నందనం , ఇల్లంద,కొత్తపల్లి కొత్త చెక్ డ్యామ్
ల నిర్మాణం కోసం కృషి చేస్తున్నానని, మరోసారి అవకాశం కల్పిస్తూ ఆశీర్వదించాలని కోరారు.