గౌడ సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది. హుస్నాబాద్ ఎమ్మెల్యే వొడితెల సతీష్ కుమార్.

జనంసాక్షి/చిగురుమామిడి-జూలై24: హుస్నాబాద్ ఎమ్మెల్యే క్యాంపు ఆఫీస్ లో ఎమ్మెల్యే వొడితేల సతీష్ కుమార్ ను ఆదివారం చిగురుమామిడి గౌడ సంఘం నాయకులు మర్యాద పూర్వకంగా కలిసి, సర్వాయి పాపన్న విగ్రహానికి సహాయమందించాలని కోరారు. శాసన సభ్యులు స్పందిస్తూ సర్వాయి పాపన్న విగ్రహాన్ని విరాళంగా ప్రకటించారు.ఈ సందర్భంగా మాట్లాడుతూ సర్దార్ సర్వాయి పాపన్న వీరత్వానికి మారుపేరని, ఈ ప్రాంతానికి చెందిన వాడుగా గర్వ పడుతున్నానన్నారు. గత ప్రభుత్వాల హాయములో తెలంగాణ వీరుల చరిత్ర కనుమరుగు చేశారని, ప్రస్తుత తెలంగాణ రాష్ట్రములో వీరుల గాధలు వెలుగు చేస్తున్నాయన్నారు. సైదాపూర్ మండలంలోని సర్వాయి పాపన్న గుట్టలు గ్రానైట్ తవ్వకాలకు అనుమతులివ్వకుండా అడ్డుకున్నాను. అలాంటి వీరుల ఆనవాళ్లుగా ఆ కట్టడాలు చరిత్రలో చిరస్థాయిగా మిగిలి ఉండాలని అన్నారు. నియోజక వర్గములో చాలా చోట్ల సర్వాయి పాపన్న విగ్రహాల ఏర్పాటుకు ప్రోత్సాహం అందించామన్నారు.ప్రభుత్వం కల్లు గీత కార్మికులకు 50 ఏళ్లకే పెన్షన్ ఇస్తుందని, తాటి చెట్లకు ఆబ్కారీ పన్ను రద్దు చేసిందన్నారు. గౌరవెల్లి రిజర్వాయర్ కు మాజీ శాసనసభ్యులు దేశిని చిన్న మల్లయ్య పేరు ప్రతిపాదనను ఇప్పటికే ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లానని అన్నారు.ఈకార్యక్రమములో జడ్పీటీసీ సభ్యులు గీకురు రవీందర్, గౌడ సంఘం మండల అధ్యక్షులు తాళ్లపెళ్లి తిరుపతి, సంఘ నాయకులు బుర్ర శ్రీనివాస్, ముంజ ప్రకాష్, వీరగోని విజ్జగిరి, బుర్ర తిరుపతి, దేశిని రాజయ్య, తోడేటి శ్రీనివాస్, గుడాల సంపత్, దేశిని విజయ్ కుమార్, బత్తిని సురేష్, బొమ్మగాని కృష్ణ, మైనార్టీ సెల్ అధ్యక్షుడు సర్వర్ పాషా తదితరులు పాల్గొన్నారు.