గ్యాస్‌పై రాష్ట్ర ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ట్యాక్స్‌ వేయడంలేదు


` రాష్ట్ర పన్ను రూ. 291 వల్లె గ్యాస్‌ ధర పెరిగిందంటున్న ఈటల దానిని నిరూపిస్తారా!
` సవాల్‌ విసిరిన మంత్రి హరీశ్‌రావు
హుజూరాబాద్‌,అక్టోబరు 12(జనంసాక్షి):గ్యాస్‌ ధర పెరుగుదలకు కారణం 291 రూపాయల రాష్ట్ర పన్నుఅని చెబుతున్న ఈటల రాజేందర్‌ దాన్ని నిరూపిస్తారా? ఈ విషయంలో జమ్మికుంట గాంధీ బొమ్మ దగ్గరకైనా, హుజూరాబాద్‌ అంబేద్కర్‌ బొమ్మ దగ్గరకు అయినా చర్చకు సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు ఈటలకు సవాలు విసిరారు. హుజురా బాద్‌ నియోజకవర్గం పెంచికల్‌ పేట గ్రామంలో మంగళవారం నిర్వహించిన గ్రావిూణ వైద్యుల ఆత్మీయ సమావేశంలో ఆర్థిక మంత్రి హరీశ్‌ రావు మాట్లాడారు.గ్యాస్‌ ధర తగ్గాలంటే రాష్ట్రం ట్యాక్స్‌ తగ్గించుకోవాలని ఈటల అంటున్నారని, కానీ రాష్ట్రప్రభుత్వం తరపున ఒక్క రూపాయి ట్యాక్స్‌ వేయడంలేదని స్పష్టం చేశారు. ఉన్నది జీఎస్టీ పన్ను 5 శాతం మాత్రమేనని అదీ కూడా కేంద్రం విధించిందేనని, అదీ 47 రూపాయలు మాత్రమే అని స్పష్టం చేశారు. గ్రావిూణ వైద్యులతో తనకు 20 ఏండ్ల ఉద్యమ అనుబంధం ఉందని, పోరాటాల్లో, ఉప ఎన్నికల్లో కలిసి పనిచేశానని, చాలా జిల్లాల్లో విూతో కలిసి దగ్గరగా పనిచేసిన సాన్నిహిత్యం ఉందని హరీశ్‌రావు అన్నారు.టీఆర్‌ఎస్‌ వచ్చాక గ్రావిూణ వైద్యులకు తొలి నాళ్లలో ట్రైనింగ్‌తో పాటు సర్టిఫికెట్స్‌ ఇవ్వాలని ఆలోచించి. బడ్జెట్‌ లో నిధులు కూడా పెట్టిందని, గతంలో ఇలా ఎక్కడా జరగలేదు. కానీ కొద్ది మంది కోర్డుకు వెళ్లడం వల్ల అది ఆగిపోయిందని, ఇప్పుడు అది కూడా పరిష్కారం అయిందని అన్నారు. గతంలో కరీంనగర్‌ లో సమస్యలు వస్తే కొప్పుల ఈశ్వర్‌ నిలబడి కాపాడారని, గ్రావిూణ వైద్యులకు ఎలాంటి వేధింపులు లేకుండా వారి సేవలు వినియోగించుకుంటామన్నారు. సిద్దిపేటలో 15 ఏండ్ల కిందటే గ్రావిూణ వైద్యులకు మంచి భవనం నిర్మించామని, అక్కడ మెడికల్‌ కాలేజి వస్తే కొత్త స్థలంలో 40 లక్షలతో భవనం కట్టించామని హరీశ్‌రావు గుర్తు చేశారు.అదే ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్న ఈటల ఆరుసార్లు గెలిచి ఒక్క భవనం కూడా నిర్మించలేదన్నారు. తమ్ముడిలా చేరదీసి ఇంతవాన్ని చేసిన కేసీఆర్‌ కు ఘోరీ కడుతానంటున్న ఈటలకు నీతినిజాయితీ ఉందా అని ప్రశ్నించారు. బీసీల బిడ్డనని చెప్పుకుని ఎస్సీ, ఎస్టీ , బీసీల భూములు కబ్జా చేశావని ఆరోపించారు. ప్రభుత్వంలో ఉంటూ ప్రభుత్వ పథకాలను విమర్శించిన మంత్రి ఈటల అని ఎద్దేవా చేశారు. బీజేపీ గెలిస్తే ఒరిగేదేం ఉండదని, టీఆర్‌ఎస్‌ గెలిస్తే హూజూరాబాద్‌ లో నిర్మాణం కావాలిసిన అన్ని రకాల భవనాలు నిర్మించడంతో పాటు, ఇండ్లు లేని పేదలకు డబుల్‌ బెడ్‌ రూం ఇండ్లు నిర్మించి ఇస్తానని హరీశ్‌రావు హవిూ ఇచ్చారు.ఈ ఎన్నికల్లో గెల్లు శ్రీనివాస్‌ ను గెలిపిస్తే అభివృద్ధి పనుల్ని దగ్గర ఉండి పూర్తి చేపిస్తానని మంత్రి హావిూ ఇచ్చారు. కమలాపూర్‌లో ఆటో ఆక్సిడెంట్‌ జరిగితే దాన్ని టీఆర్‌ఎస్‌ విూద రుద్దే ప్రయత్నం చేశారు. కానీ అతడు బండి సంజయ్‌ సన్నిహితుడని తేలిందని హరీశ్‌రావు స్పష్టం చేశారు.హూజురాబాద్‌ టీఆర్‌ఎస్‌ అభ్యర్థి గెల్లు శ్రీనివాస్‌ మాట్లాడుతూ ఆర్‌ఎంపీ లు, పీఎంపీలులేకుండా గ్రామాలులేవని, 24 గంటలు అందుబాటులో ఉండి ఆరోగ్య సేవలందించేది గ్రావిూణ వైద్యులు మాత్రమే నని అన్నారు. రాజకీయాలను గ్రామాల్లో ప్రభావితం చేసే శక్తులు గ్రావిూణ వైద్యులేనని, హూజూరాబాద్‌ ఎన్నికల్లో తనను గెలిపించాలని ఆయన కోరారు.