గ్యాస్‌ కేటాయింపు ప్రభుత్వ అసంబద్ద నిర్ణయం: జేపి

హైదరాబాద్‌: కేజీ బేసిన్‌లో గ్యాస్‌ను ప్రాదాన్యాలు విస్మరించి మహారాష్ట్ర రత్నగిరి విద్యుత్‌ ప్రాజెక్టుకు కేటాయించడం ప్రభుత్వం గతంలో తీసుకున్న అసంబద్ద నిర్ణయమని లోక్‌సత్తా అధ్యక్షుడు జయప్రకాశ్‌ నారాయణ విమర్శించాడు. ప్రధాన మంత్రి జోక్యం చేసుకొని ఈ నిర్ణయాన్ని సమీక్షించాలని డిమండ్‌ చేశారు. ఈ ప్రాజెక్టు గతంలో ఎన్‌రాన్‌ పేరుతో ఉండేదని, మిగతా విద్యుత్‌ ప్రాజెక్టులను తోసిరాజని, దీనికే గ్యాస్‌ కేటాయించడం వెనుక అనేక అనుమానాలు తలెత్తుతున్నాయని ఆరోపించారు. కేంద్ర సాధికార కమిటీ నిర్ణయం మేరకే గ్యాస్‌ కేటాయింపులు జరిగాయంటున్న జైపాల్‌ రెడ్డి వ్యాఖ్యలు సమస్యను పరిష్కరించలేవన్నారు. అడ్డదారుల్లో జరిగిన కేటాయింపులపై రాష్ట్రంలో ఎంపీలు, ఎమ్యేల్యేలు పార్టీలకు అతీతంగా కేంద్రంపై ఒత్తిడి తేవాలని పిలుపునిచ్చారు.