గ్యాస్ సిలిండర్ల దొంగల పట్టివేత : 220 సిలిండర్లు స్వాథీనం
దేవరకొండ : రాష్ట్రంలో వివిధ జిల్లాల్లో గ్యాస్ సిలిండర్ల గోదాముల్లో చోరీలకు పాల్పడి సిలిండర్లు దొంగిలించి విక్రయిస్తున్న ముఠాను నల్గొండ జిల్లా దేవరకొండ పోలీసులు శుక్రవారం పట్టుకున్నారు. వారినుంచి 220 సిలిండర్లు, 5 గ్యాస్ స్టవ్లు స్వాథీన పరచుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. కృష్ణా జిల్లా నందిగామ, మెదక్ జిల్లా సిద్ధిపేట, నల్గొండ జిల్లా చింతపల్లి, మహబూబ్నగర్ జిల్లా జడ్చర్ల, కల్వకుర్తిలలో గత నెలరోజులుగా గ్యాస్ గోదాముల్లో చోరీలు జరిగాయి. ఈ విషయంపై బాధితులు వివిధ పోలీస్ స్టేషన్లలో ఫిర్యాదు చేశారు. నిందితులు శుక్రవారం రంగారెడ్డి జిల్లాలో సిలిండర్లు విక్రయిస్తుండగా దేవరకొండ పోలీసులు పట్టుకున్నారు. విచారణలో ఇతర జిల్లాల్లోనూ దొంగిలించిన విషయాన్ని దొంగలు వెల్లడించారు.