గ్రంధాలయంలో ఘనంగా కె.టి.ఆర్ జన్మదిన వేడుకలు

* గిఫ్ట్ ఏ స్మైల్ లో భాగంగా బుక్స్ పంపిణీ చేసిన మేయర్
* జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవిందర్ రెడ్డి

కరీంనగర్ బ్యూరో ( జనం సాక్షి) :
రాష్ట్ర ఐటీ , పురపాలక శాఖ మంత్రి, టి.ఆర్.ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కె.టి రామారావు జన్మదిన వేడుకలు జిల్లా గ్రంథాలయ సంస్థ కేంద్ర కార్యాలయంలో సంస్థ చైర్మన్ ఏనుగు రవిందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కె.టి.ఆర్ గిఫ్ట్ ఏ స్మైల్ కార్యక్రమ పిలుపు లో భాగంగా గ్రంధాలయంలో ఉద్యోగాలకు, పోటీ పరీక్షలకు సిద్దమవుతున్న అభ్యర్థులకు సుమారు 800 మందికి కావాల్సిన పి.ఎన్.ఆర్ పబ్లికేషన్స్ తో తయారుచేసిన పుస్తకాలను ముఖ్య అతిధి మేయర్ సునీల్ రావ్ తో కలిసి అందచేశారు. ఈ సందర్భంగా మేయర్ సునీల్ రావ్ మాట్లాడుతూ మంత్రి కె.టి.ఆర్ ఆయురారోగ్యాలతో నిండు నూరేళ్లు జీవితాన్ని ప్రసాదించాలని భగవంతుని ప్రార్థిస్తున్నామన్నారు. త్వరగా కాలి గాయం నుండి కోలుకోవాలని ప్రార్థించారు. గ్రంథాలయ సంస్థ చైర్మన్ ఏనుగు రవిందర్ రెడ్డి వందలాది మందికి కావాల్సిన పుస్తకాలను అందచేయడం గొప్ప విషయమన్నారు. విద్యార్థులు ఇలాంటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోని ఉన్నతమైన ఉద్యోగాలు సందించాలన్నారు. గతంలో కనీసం న్యూస్ పేపర్ చదవడానికి ఇబ్బందిగా ఉన్న వసతుల నుండి ఈరోజు డిజిటల్ లైబ్రరీ గా అన్ని అధునాతన వసతులతో కూడిన సదుపాయాన్ని కల్పించిన ఘనత కేవలం టి.ఆర్.ఎస్ ప్రభుత్వానిదే అన్నారు. గ్రంథాలయ అభివృద్ధిలో , పాఠకులకు కావాల్సిన వసతులు సౌకర్యాల పై ఏనుగు రవిందర్ రెడ్డి చూపిస్తున్న కృషిని మేయర్ అభినందించారు. స్మార్ట్ సిటీ లో భాగంగా విడుదలైన ఏడూ కోట్ల రూపాయలతో నూతన ఆధునిక బిల్డింగ్ కి పనులు ప్రారంభిస్తామన్నారు. పోటీ పరీక్షల తో పాటు పెద్దలకు, విశ్రాంత ఉద్యోగులకు తగిన సౌకర్యాలతో నిర్మాణం చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో సూడా డైరెక్టర్ షేక్ యూసుఫ్, ఎం.పి.టి.సి టి.ఆర్.ఎస్.వి జిల్లా కోఆర్డినేటర్ ద్యావ మధుసూదన్ రెడ్డి, కరీంనగర్ టి.ఆర్.ఎస్.వి అధ్యక్షుడు ఫహాద్, నాయకులు వర్మ, తేజ, ఓంకార్, తబ్రెస్, సిద్దు సతీష్ మరియు గ్రంథాలయ సిబ్బంది సరిత, మల్లేశం తదితరులు పాల్గొన్నారు.