గ్రామకంఠం భూములపై ప్రజాభిప్రాయ సేకరణ

ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి స్మితా సబర్వాల్ తూప్రాన్ జనం సాక్షి ఆగస్టు 19:: గ్రామ కంఠంలో కల భూముల కు ఏ విధమైన యాజమాన్య హక్కులు కల్పించాలో గ్రామ ప్రజల అభిప్రాయ సేకరణకు వచ్చినట్లు రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రధాన కార్యదర్శి స్మిత సబర్వాల్ పేర్కొన్నారు మెదక్ జిల్లా తూప్రాన్ మండలంలోని యావాపూర్ గ్రామంలో ప్రజాభిప్రాయ సేకరణ కు వచ్చిన సందర్భంగా ఆమె గ్రామస్తులతో అభిప్రాయాలను తెలుసుకొని మాట్లాడారు గ్రామకంఠం మరియు గ్రామంలో ఇంటి యజమానుల అధీనంలో ఉన్న గ్రామ కంఠం భూమికి యాజమాన్య హక్కులు ఏ రకంగా కల్పించాలో గ్రామస్తులు ఆమె అడిగి తెలుసుకున్నారు గ్రామకంఠం భూములు కొందరు క్రయ విక్రయాలు సాదా బైనామా కాగితంతో చేస్తున్నారని వాటికి ప్రభుత్వపరంగా హక్కులు రావడంలేదని ప్రభుత్వ పరంగా హక్కులు కల్పిస్తే ఇతరులకు అమ్ముకునే అవకాశం ఉంటుందని వారు తెలిపారు గ్రామపంచాయతీ అధికారులు పంచాయతీ పాలకవర్గం ఆమోదంతో కొద్దిపాటి రుసుముతో రిజిస్టర్ చేస్తే తమకు ఎలాంటి సమస్య రాదని భవిష్యత్తులో సమస్యలు అనేవి ఉండవని గ్రామస్తులు తెలిపారు చట్టపరమైన హక్కులు కల్పించడానికి కృషి చేయాలని తెలిపారు సాదా బైనామా పై క్రయవిక్రియలు చేసి మళ్లీ తాము అమ్మ లేదంటూ చెబుతున్నారని దీనితో సాదా బైనా మాకు ఎలాంటి విలువ లేకుండా పోయిందని అట్టి వాటిని గ్రామ కంఠం భూములపై సమగ్ర సర్వే చేసి రిజిస్టర్ చేయాలని కోరారు సాదా బైనమా పై భూమిని కొన్నవారు అమ్మినవారు మేము అమ్మలేదంటూ వ్యతిరేకిస్తున్నారని దీని వల్ల అనేక సమస్యలు వస్తున్నాయని సమస్యల పరిష్కారానికి చట్టంతీసుకోవాలని గ్రామస్తులు అధికారులకు విన్నవించారు దీనిపై ఆమె స్పందిస్తూ సాదా బైనమా పై క్రయ విక్రయాలు చేసిన వాటిపై గ్రామ పంచాయతీ పాలకవర్గం అనుమతితో చట్టపరమైన హక్కులు కల్పించడానికి రాష్ట్ర ముఖ్యమంత్రితో చర్చించి చట్టం తీసుకువచ్చే ఏర్పాట్లు జరుగుతున్నాయని తాము ప్రజాభిప్రియ సేకరణకు వచ్చినట్లు తెలిపారు మీరు తెలిపిన అభిప్రాయాలను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తానని ఆమె సందర్భంగా గ్రామస్తులకు హామీ ఇచ్చారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ కమిషనర్ హనుమంతరావు జిల్లా కలెక్టర్ హరీష్ అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ డిపిఓ తరుణ్ ఆర్డీవో శ్యాంప్రకాష్ జిల్లా అధికారులు మండల టిఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు బాబుల్ రెడ్డి యావాపూర్ సర్పంచ్ నరసింహ రెడ్డి తదితరులు పాల్గొన్నారు