*గ్రామదేవతల ఆలయాలు అభివృద్ధికి ప్రభుత్వం కృషి* – ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్
*మునగాల, జూన్ 9(జనంసాక్షి): గ్రామ దేవతలను ఆరాధించడం తెలంగాణ సంస్కృతిలో భాగమే అని కోదాడ శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. గురువారం మునగాల మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పెద్దమ్మ తల్లి, పోతరాజు విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రత్యేక పూజలు ప్రత్యేక పూజలు నిర్వహించి, ముదిరాజ్ భవనాన్ని ప్రారంభోత్సవం చేశారు . గ్రామాల్లో ప్రజలకు ఏ కష్టం వచ్చినా గ్రామ దేవతలను మొక్కడంతో కష్టాలు తొలగిపోతాయని, ప్రజల్లో మంచి విశ్వాసం ఉంటుందన్నారు. తెలంగాణ ప్రభుత్వం అధికారంలో చేపట్టిన తర్వాత ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో గ్రామాల్లో ప్రజల విశ్వాసాలకు ఆచార వ్యవహారాలకు సముచిత స్థానం ఇస్తుందన్నారు. గ్రామదేవతల ఆలయాలు అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. ప్రజల మంచి కోసం జరిగే కార్యక్రమాలకు తన వంతు సహకారం అన్నివేళలా ఉంటుందన్నారు. పెద్దమ్మ తల్లి పోతరాజు ఆశీస్సులతో పరగణా ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని అన్నారు. గ్రామాల్లో జరిగే వేడుకల్లో ప్రభుత్వం భాగస్వామ్యమై వేడుకలు ఘనంగా జరిగే ఎందుకు కృషి చేస్తుందన్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యేను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ చింతకాయల ఉపేందర్, మండల పార్టీ అధ్యక్షులు తొగరు రమేష్, టిఆర్ఎస్ నాయకులు నల్లపాటి శ్రీనివాసరావు, పిఎసిఎస్ చైర్మన్ లు కందిబండ సత్యనారాయణ, తొగరు సీతారాములు, మండల ప్రధాన కార్యదర్శి వెంకట్ రెడ్డి, ముదిరాజ్ సంఘం నాయకులు, గ్రామ ప్రజలు, టిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.