గ్రామపంచాయతీల బిల్ కలెక్టర్స్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా యజ్ఞ నారాయణ కొండమల్లేపల్లి

 

 

 

 

 

 

 

 

డిసెంబర్ 13 జనం సాక్షి న్యూస్ : కొండమల్లేపల్లి మేజర్ గ్రామపంచాయతీకి చెందిన బిల్ కలెక్టర్ యజ్ఞ నారాయణ గ్రామ పంచాయితీల బిల్ కలెక్టర్స్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికయ్యారు కొత్తపేట బాబు జగ్జీవన్ రామ్ భవన్ లో సోమవారం నాడు తెలంగాణ గ్రామ పంచాయతీ కారోబార్, బిల్ కలెక్టర్స్ ఉద్యోగుల సంఘం సమావేశం జరిగింది ఈ సమావేశానికి రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి కారోబార్, బిల్ కలెక్టర్స్ అందరూ హాజరయ్యారు ఈ సందర్భంగా సంఘం రాష్ట్ర నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు రాష్ట్ర అధ్యక్షులుగా యజ్ఞ నారాయణ, ప్రధాన కార్యదర్శిగా ఆర్కే నాయుడు, రాష్ట్ర కార్యదర్శిగా మెట్టు వెంకటరెడ్డి, పిల్లి యాదగిరి, రాష్ట్ర ఉపాధ్యక్షులుగా సదానందం, సాధు శ్రీకాంత్, వడ్డెబోయిన వెంకటేశం లను ఎన్నుకున్నారు ఈ సందర్భంగా గ్రామ పంచాయతీల బిల్ కలెక్టర్స్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నూతన అధ్యక్షులుగా ఎన్నికైన యజ్ఞ నారాయణ మాట్లాడుతూ నా ఎన్నికకు సహకరించిన కారోబార్, బిల్ కలెక్టర్స్ ఉద్యోగులను హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేశారు నూతన రాష్ట్ర అధ్యక్షులు యజ్ఞ నారాయణ మాట్లాడుతూ కారోబార్, బిల్ కలెక్టర్స్ ఉద్యోగుల సంక్షేమానికి అన్ని రకాలుగా కృషి చేస్తానని తెలియజేశారు ఈ నూతన కార్యవర్గం ఎన్నికల్లో తెలంగాణ రాష్ట్ర మంత్రివర్యులు హరీష్ రావు యువసేన రాష్ట్ర ఉపాధ్యక్షులు గుండాల మల్లేష్ గౌడ్ పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఉద్దేశించి మాట్లాడి నూతన కార్యవర్గానికి శుభాకాంక్షలు అభినందనలు తెలియజేశారు