గ్రామపంచాయతీ ట్రాక్టర్ సొంత పనులకు ఉపయోగించుకుంటున్న సర్పంచ్ శ్రీనివాస్..??

 

 

 

 

 

 

 

 

 

 

 

ఏ ఒక్క రోజు ఊర్లో ఉండని సర్పంచ్ శ్రీనివాస్..?

ప్రశ్నించిన వారిపై బెదిరింపులకు గురి చేస్తున్న సర్పంచ్ సర్పంచ్ శ్రీనివాస్ పై చర్యలు తీసుకోవాలి..?

జనం సాక్షి (కొల్చారం)
మండలం అంసాన్ పల్లి గ్రామపంచాయతీ పరిధిలో ప్రభుత్వం మంజూరు చేసిన ట్రాక్టర్ను సర్పంచ్ శ్రీనివాస్ తమ స్వంత పనులకు వినియోగిస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గ్రామపంచాయతీలో చెత్త తరలించేందుకు ప్రభుత్వం ట్రాక్టర్ మంజూరు చేస్తే దాన్ని గ్రామపంచాయతీ సర్పంచ్ శ్రీనివాస్ దుర్వినియోగం చేస్తున్నారని స్థానికుల ఆరోపిస్తున్నారు. గ్రామపంచాయతీ పనులకు కాకుండా సొంత కాంట్రాక్టు పనులకు ట్రాక్టర్లు వినియోగిస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతిని స్పందించి గ్రామపంచాయతీ ట్రాక్టర్ దుర్వినియోగం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు