గ్రామసంతకు ప్రారంభోత్పసవం
నిజామాబాద్,మార్చి02(జనంసాక్షి): బీర్కూర్ మండలంలోని సంగెం గ్రామంలో ఎంపీపీ వీణ, జడ్పీటీసీ కిషన్ సోమవారం గ్రామసంతను ప్రారంభించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు ఎంపీపీ, జడ్పీటీసీలను శాలువ కప్పి సన్మానించారు. ఈ కార్యక్రమంలో జిల్లా గ్రంథాలయ లద్ఘిర్మన్ శ్రీనివాస్‌యాదవ్, సర్పంచి కాశీరాం, జడ్పీ కోఆప్షన్ సభ్యుడు, ఎంపీటీసీ విఠల్ తదితరులు పాల్గొన్నారు.అలాగే మండల కేంద్రంలోని తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం ప్రజావాణి కార్యక్రమం నిర్వహించారు. తహసీల్దారు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలుశాఖల అధికారులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఆసరా పింఛన్లు ఇప్పించాలని, ఆహార భద్రత బియ్యం, ఇళ్ల స్థలాల పంపిణీ చేయాలంటూ దరఖాస్తుదారులు తమ అర్జీలు సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మల్లికార్జున్‌రెడ్డి, ఎంఈవో గోపాల్‌రావు, ఉపతహసీల్దారు ప్రమోద్‌కుమార్, ఏవో కమల తదితరులు పాల్గొన్నారు. ఇదిలావుంటే ఆరోగ్య లక్ష్మి ఆహారం తీసుకుంటే గర్భిణులు, బాలింతలు చిన్నారులు పరిపూర్ణ ఆరోగ్యంగా ఉంటారని కమిటీ సభ్యులు, విశ్రాంత ఉపతహసీల్దారు నారాయణ తెలిపారు. సోమవారం బీర్కూర్ మండల కేంద్రంలోని ఎస్సీ వాడలోని అంగన్‌వాడీ కేంద్రంలో ఆరోగ్య కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. సభ్యుల సమన్వయంతో పథకాన్ని మరింత బలోపేతం చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచి నర్సయ్య, వార్డు సభ్యులు శంకర్, అన్వర్, రఘు. అంగన్‌వాడీ కార్యకర్తలు నాగమణి, శివజ్యోతి పాల్గొన్నారు.