గ్రామాభివృద్ధికి చర్యలు తీసుకోవాలి

మెదక్‌,సెప్టెంబర్‌11 ( జనంసాక్షి ) :   ప్లలె ప్రగతికి ప్రతిఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్సీ కార్పొరేషన్‌ ఈడీ, బాబురావు అన్నారు. మండలస్థాయి అధికారులు, గ్రామ ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శిలతో సమావేశంలో బాబురావు మాట్లాడుతూ సీఎం కేసీఆర్‌ గ్రామాల అభివృద్ధికి ప్రత్యేక దృష్టి పెట్టి ప్రణాళిక రూపొందించినట్లు తెలిపారు.అన్ని గ్రామ పంచాయతీల్లో గ్రామ స్వరూపాన్ని మార్చేందుకు కమిటీలను ఏర్పాటు చేయాలన్నారు. ఈ కమిటీలో అన్ని కులాల వారికి ప్రాతినిధ్యం కల్పించాలన్నారు. 30రోజుల ప్రణాళికతో అన్ని గ్రామాలు ఆదర్శంగా గ్రామాలు తీర్చిదిందాలన్నారు. కార్యక్రమంలో మండలస్థాయి, గ్రామ ప్రత్యేకాధికారులు, పంచాయతీ కార్యదర్శులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుని విజయవంతం చేయాలన్నారు.
ఇదిలావుంటే కస్తూర్బా గాంధీ పాఠశాలలో చదువుతున్న విద్యార్థినులు అన్ని రంగాల్లో రాణించాలని డిఇవో అన్నారు. కస్తూర్బా గాంధీ బాలికల హాస్టలో విద్యాలర్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ప్రతి విద్యార్థి చదువును ప్రేతో చదువాలని అన్నారు. విద్యార్థులు తరగతిగదిలో అధ్యాపకులు బోధిస్తున్న తీరును శ్రద్ధగ బాగా చదువుకోవాలని  తెలిపారు.