గ్రామాలలో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలి

 

నర్సాపూర్, సెప్టెంబర్, 27, ( జనం సాక్షి ) :
గ్రామాలలోని సమస్యలను పరిష్కరించేందుకు అధికారులు ఆయా గ్రామాల ప్రజాప్రతినిధులతో సమన్వయంతో పనిచేయాలని ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్ అధికారులకు ప్రజాప్రతినిధులకు సూచించారు మంగళవారం నర్సాపూర్ మండల పరిషత్ కార్యాలయంలో ఎంపీపీ జ్యోతి సురేష్ నాయక్ అధ్యక్షతన మండల సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేశారు ఈ సమావేశానికి మండల పరిధిలోని వివిధ గ్రామాలకు చెందిన ప్రజా ప్రతినిధులు అధికారులు హాజరయ్యారు తాసిల్దార్ ఆంజనేయులు మాట్లాడుతున్న సమయంలో కాజీపేట ఎంపీటీసీ ఆంజనేయులు గౌడ్ కలగజేసుకొని నర్సాపూర్ మండలంలో కొందరు రేషన్ షాపులకు చెందిన బియ్యాన్ని కొనుగోలు చేసి రైస్ మిల్లులకు అమ్ముతున్నప్పటికీ అధికారులు పట్టించుకోవడంలేదని అన్నారు అదేవిధంగా నర్సాపూర్ పట్టణంలో విలువైన ప్రభుత్వ భూములను కొందరు కబ్జాలు చేసి ప్లాట్లుగా తయారుచేసి అమ్ముతున్నారని ఇంత జరుగుతున్నప్పటికీ అధికారులు పట్టించుకోకపోవడం ఇంతవరకు సమంజసమని ప్రశ్నించారు తాసిల్దార్ కలుగజేసుకొని పై అధికారులు దృష్టికి తీసుకువెళ్లి చర్యలు తీసుకుంటామని చెప్పారు అనంతరం మిషన్ భగీరథ ఏఈ లక్ష్మీ ప్రసాద్ మాట్లాడుతున్న సమయంలో పిల్లుకుంట సర్పంచ్ బాల్ శెట్టి కలుగజేసుకొని తమ తండాకు అనేక రోజులుగా మంజీరా నీరు రావడంలేదని ఎన్నిసార్లు అధికారులకు చెప్పిన పట్టించుకోవడం లేదన్నారు దీంతో మిషన్ భగీరథ డి ప్రవీణ్ కలగజేసుకొని రెండు మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు వ్యవసాయ శాఖ మండలాధికారి మాట్లాడుతున్న సమయంలో నాగులపల్లి సర్పంచ్ సేనాధిపతి కలుగజేసుకుని తమ గ్రామపంచాయతీ ఆవంచ పరిధిలో ఉన్న రైతు వేదిక క్లస్టర్ లోకి వెళ్లినందున తమ గ్రామం ఆవంచకు దూరంగా ఉన్నందున అక్కడికి వెళ్లాలంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని వెంటనే తమ గ్రామాన్ని నర్సాపూర్ రైతు వేదిక క్లస్టర్ లోకి మార్చాలని కోరారు దీంతో వ్యవసాయ మండల అధికారి మాట్లాడుతూ పై అధికారుల దృష్టికి తీసుకువెళ్లి సమస్య పరిష్కరించే విధంగా కృషి చేస్తానని అన్నారు ఈ కార్యక్రమంలో ఎంపీడీవో మార్టిన్ లూథర్ తాసిల్దార్ ఆంజనేయులు ఆర్డబ్ల్యూఎస్ డీఈ కిషన్ మిషన్ భగీరథ డి ఈ ప్రవీణ్ పంచాయతీరాజ్ ఏఈ స్వామి దాస్ ఏపీఎం గౌరీ శంకర్ ఆయా గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు సురేష్ గౌడ్ కవితా రెడ్డి శివకుమార్ శ్రీరాములు శ్రీశైలం శ్రీనివాస్ గుప్తా ఆంజనేయులు గౌడ్ లక్ష్మీ తదితరులు పాల్గొన్నారు.