*గ్రామాల్లో పడకేసిన పారిశుధ్య నిర్వహణ*

*పలిమెల, జులై 24 (జనంసాక్షి)* మండలంలోని పలు గ్రామాలలో పారిశుధ్య పనులు అటకెక్కాయని బిజేపి మండల అధ్యక్షుడు కోయల్కర్ నిరంజన్ ఆరోపించారు. మండలంలోని లెంకలగడ్డ గ్రామంలో పంచాయతీ ట్రాక్టర్ రాకపోవడంతో రహదారులపైనే చెత్తా చెదారం ఉంటుందని గ్రామస్తులు వాపోతున్నారు. అసలే వర్షాకాలం కావడంతో చెత్తాచెదారం పై ఈగలు దోమలు పెరుగుతున్నాయని తద్వారా మలేరియా, డెంగ్యూ వంటి సీజనల్ వ్యాదులు ప్రబలే అవకాశం ఎక్కువగా ఉంటుందని వాపోతున్నారు. వర్షాల వల్ల వచ్చిన వరదలు తగ్గుముఖం పట్టినా పంచాయతీలలో ఎక్కడి చెత్త అక్కడే పేరుకపోయి ఉంటుందనీ, అధికారులు స్పందించి గ్రామాలలో పారిశుధ్య పనులు సక్రమంగా నిర్వహించాలని కోయల్కర్ నిరంజన్ అధికారులను కోరారు.