*గ్రామాల అభివృద్దే ముఖ్యమంత్రి కేసీఆర్ లక్ష్యం* – ఐదో విడత పల్లె ప్రగతి కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే బొల్లం

మునగాల, జూన్ 03(జనంసాక్షి): గ్రామాల్లో నెలకొన్న సమస్యలను తెలుసుకొని గ్రామాలను అభివృద్ధి చేసేందుకు తెలంగాణ ప్రభుత్వం పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా  చేపట్టిందని కోదాడ అభివృద్ధి ప్రదాత, శాసనసభ్యులు బొల్లం మల్లయ్య యాదవ్ అన్నారు. శుక్రవారం మునగాల మండల పరిధిలోని విజయరాఘవపురం గ్రామంలో ఐదవ విడత పల్లె ప్రగతి కార్యక్రమాన్ని ఎమ్మెల్యే మల్లయ్య యాదవ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత పాలకుల నిర్లక్ష్యంతో అనేక గ్రామాలు నాగరికతకు దూరంగా ఉన్నాయని టిఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గ్రామాల సర్వతోముఖాభివృద్ధికి కృషి చేస్తూ  గ్రామాలను చైతన్యం చేసిందన్నారు. నేడు గ్రామాల్లో విద్య వైద్యం మౌలిక సదుపాయాలు రోడ్లు డ్రైనేజీలు మంచినీటి సౌకర్యం విద్యుత్ సదుపాయం రవాణా సౌకర్యాలు కల్పిస్తూ గ్రామాలను పట్టణాలు గా మార్చేందుకు తెలంగాణ ప్రభుత్వం కృషి చేసిందన్నారు. పల్లెలే పట్టు కొమ్ములు అన్న గాంధీజీ కలలను సాకారం చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ నడుము కట్టారన్నారు. ప్రజలు గ్రామాల్లోని సమస్యలను ప్రజాప్రతినిధుల ద్వారా అధికారుల దృష్టికి తీసుకొచ్చి గ్రామ సభల్లో చర్చించుకుని గ్రామాలను అభివృద్ధి చేసుకోవాలన్నారు. నేడు ప్రభుత్వ అధికారులను గ్రామాల్లోకి పంపించి సమస్యలను ప్రభుత్వం వెంటనే  పరిష్కరిస్తుదన్నారు. గ్రామ సమస్యల పరిష్కారానికి ప్రతినెల గ్రామ పంచాయతీలకు నిధులు ఇస్తున్న ఏకైక ప్రభుత్వం టిఆర్ఎస్ ప్రభుత్వం అన్నారు. పల్లె ప్రగతిలో గ్రామస్తులు భాగస్వాములు కావాలన్నారు. పెండింగ్లో ఉన్న పనులను ప్రజా ప్రతినిధులు అధికారులు సమన్వయంతో పూర్తి చేయాలన్నారు. అనంతరం ఎమ్మెల్యేను ఘనంగా సత్కరించారు.  గ్రామంలోని లబ్ధిదారులు అందరికీ కళ్యాణలక్ష్మి, షాదీ ముబారక్ మరియు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను ఎమ్మెల్యే అందజేశారు. తెలంగాణ తొలి ఉద్యమ నాయకులు సుబ్బారావును ఎమ్మెల్యే బొల్లం సన్మానించారు.ఈ కార్యక్రమంలో మార్కెట్ కమిటీ చైర్మన్ బుర్ర సుధారాణి పుల్లారెడ్డి, రైతు సమన్వయ సమితి అధ్యక్షులు సుంకర అజయ్ కుమార్, సొసైటీ చైర్మన్ కందిబండ సత్యనారాయణ, మండల పార్టీ అధ్యక్షులు తొగరు రమేష్, ఎమ్మార్వో కృష్ణ, ఎంపీడీవో వెంకటేశ్వర్లు, టిఆర్ఎస్ నాయకులు నల్లపాటి శ్రీనివాసరావు, వెంకట్ రెడ్డి, సోమపొంగు సైదులు, లింగారావు, మహిళా అధ్యక్షురాలు కవిత, గ్రామ పాలక మండలి తదితరులు పాల్గొన్నారు.