గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి
-మత్స్యకారుల సంక్షేమానికి ప్రభుత్వం కృషి
– ఫిష్‌హబ్‌గా తెలంగాణ రాష్ట్రం
-దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వందశాతం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణ
సెప్టెంబర్ 24 జనం సాక్షి (కొండమల్లేపల్లి) దేవరకొండ ఎమ్మెల్యే,టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రవీంద్ర కుమార్
గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతానికి ప్రభుత్వం కృషి చేస్తుంది అని దేవరకొండ శాసన సభ్యులు,టిఆర్ఎస్ పార్టీ నల్గొండ జిల్లా అధ్యక్షులు రమావత్ రవీంద్ర కుమార్ అన్నారు.శనివారం కొండమల్లేపల్లి మండలం పెండ్లిపాకుల చెరువులో ఎమ్మెల్యే రవీంద్ర కుమార్ 9లక్షల ఉచిత చేపలను వదిలారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ…కుల వృత్తులను ఆదుకునేందుకు ప్రభుత్వం అనేక కార్యక్రమాలు అమలు చేస్తుంది అని,అందులో భాగంగానే మత్స్యకారుల జీవనోపాధి కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 46 వేల చెరువులు, రిజర్వాయర్లల్లో ఉచిత చేప పిల్లలను వదులుతున్నట్టు ఆయన తెలిపారు.నియోజకవర్గంలో కోటి ఉచిత చేప పిల్లలను వదలనున్నట్లు ఆయన తెలిపారు.పెరిగిన చేపలను అమ్ముకునేందుకు సబ్సిడీపై లగేజీ అటోలు, మోపెడ్ బైక్‌లు, పరికరాలు కూడా ప్రభుత్వం అందజేస్తుంది అని పేర్కొన్నారు.దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా వందశాతం ఉచితంగా చేప పిల్లలను పంపిణీ చేస్తున్న ఏకైక రాష్ట్రం తెలంగాణేనని ఆయన స్పష్టం చేశారు.చేపల పెంపకం కోసం సీడ్ ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటు చేసే దిశగా ప్రభుత్వం కృషి చేస్తుంది అని అన్నారు.
చేప పిల్లలను వందశాతం సబ్సిడీతో చెరువులు, కుంటల్లో వదిలేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది అని ఆయన అన్నారు.రైతు బంధు,రైతు బీమా దేశానికి ఆదర్శం అని అన్నారు.అభివృద్ధి లో, సంక్షేమంలో టి ఆర్ ఎస్ ప్రభుత్వం దేశానికే ఆదర్శంగా నిలిచిందన్నారు.పేదింటి ఆడపడుచులు పెళ్లిళ్లకు లక్ష రూపాయలు,వృద్ధులకు తదితరులకు ₹2016, వికలాంగులకు ₹3016 పింఛన్లు ఇస్తూ ఆత్మవిశ్వాసం నింపాడం జరిగింది అని ఆయన అన్నారు.ఈ కార్యక్రమంలో జిల్లా మత్స్యశాఖ అధికారి ఎం వెంకయ్య, మారయ్య, దేవరకొండ మార్కెట్ కమిటీ చైర్మన్ శిరందాసు లక్ష్మమ్మకృష్ణయ్య, సర్పంచుల ఫోరం అధ్యక్షుడు కుంభం శ్రీనివాస్ గౌడ్,జడ్పీటీసీ సలహాదారుడు పసునూరి యుగేందర్ రెడ్డి, టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు రమావత్ దాస్రు నాయక్,రైతు బంధు అధ్యక్షుడు సిరందాసు కృష్ణయ్య,మాజీ ఎంపీపీ మేకల శ్రీనివాస్ యాదవ్,టిఆర్ఎస్ పార్టీ రాష్ట్ర నాయకులు నేనవత్ రాంబాబు నాయక్, పెళ్లిపాకల సర్పంచ్ మేకల సావిత్రి, గుడి తండా సర్పంచ్ నేనావత్ అంజలిరాంబాబు,రమావత్ తూలిసిరామ్,వెంకట్ రెడ్డి, నేనావత్ మధు,శంకర్ నాయక్,రమావత్ శ్రీను నాయక్,రమేష్,దిప్ల,బోడ్డుపల్లి కృష్ణ,శకృ నాయక్,రూప్ల నాయక్,బాలు నాయక్,తదితరులు పాల్గొన్నారు