గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యం

ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి.

జనం సాక్షి/సైదాపూర్ ఆగస్టు 15.

గ్రామీణ ప్రాంతాలను అభివృద్ధి చేయడమే ముఖ్యమంత్రి కెసిఆర్ లక్ష్యమని సైదాపూర్ ఎంపీపీ సారబుడ్ల ప్రభాకర్ రెడ్డి పేర్కొన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని కొత్త బస్టాండ్ వద్ద ముఖ్యమంత్రి కెసిఆర్, హుస్నాబాద్ శాసనసభ్యులు ఒడితెల సతీష్ కుమార్ ల చిత్రపటాలకు పాలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… సైదాపూర్ మండలంలోని గొడిశాల ఎస్సీ కాలనీ నుంచి గుజ్జులపల్లి శివాలయం వరకు బీటీ రోడ్డు నిర్మాణానికి రూ.70 లక్షల నిధులు మంజూరు చేశారని, అలాగే పెర్కపల్లి చిలుకల వాగుపై బ్రిడ్జి నిర్మాణం కోసం రూ. కోటి 25 లక్షల నిధులు మంజూరు చేసి ఆ గ్రామాల ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చిన ఎమ్మెల్యే సతీష్ కుమార్ కి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రావుల శ్రీధర్ రెడ్డి, బీఆర్ఎస్ మండల పార్టీ అధ్యక్షుడు సోమారపు రాజయ్య, సర్పంచుల పోరం అధ్యక్షులు చందా శ్రీనివాస్, సింగిల్ విండో చైర్మన్లు కొత్త తిరుపతిరెడ్డి, బిల్లా వెంకటరెడ్డి, సర్పంచులు కొండ గణేష్, బత్తుల కొమురయ్య, ఎంపిటిసిలు తొంట ఓదెలు, బీఆర్ఎస్ నాయకులు బత్తుల లక్ష్మీనారాయణ, నరేష్,రాజేశ్వర్ రెడ్డి, దొకిడి తిరుపతి,ఎనమల్ల రమేష్, మాచమల్ల శ్రీకాంత్,మాధం స్వామి, విజయ్ కుమార్, రాజు, రవీందర్ రెడ్డి, అక్షయ శ్రీనివాస్ తదితరులు ఉన్నారు.

తాజావార్తలు