గ్రామ శాఖ అధ్యక్షుని పరామర్శ.

బెజ్జంకి,సెప్టెంబర్10,(జనం సాక్షి): మండల కేంద్రంలోని గాగిల్లపూర్ గ్రామంలో శనివారం తెరాస గ్రామ శాఖ అధ్యక్షులు బొమ్మరవేని వెంకటేష్ తండ్రి ఇటీవల మరణించగా వారి కుటుంబ సభ్యులను రాష్ట్ర సాంస్కృతిక సారథి,శాసనసభ్యులు రసమయి బాలకిషన్ పరామర్శించి ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో ఎంపీపీ లింగాల నిర్మల లక్ష్మణ్,జెడ్పీటీసీ కనగండ్ల కవిత తిరుపతి,మండల కో ఆప్షన్ సభ్యులు,తెరాస మండల అధ్యక్షులు పాకాల మహిపాల్ రెడ్డి,ఏఎంసీ చైర్మన్ కచ్చు రాజయ్య,ఎంపీటీసీ కొమిరే మల్లేశం,తెరాస రాష్ట్ర నాయకులు చింతకింది శ్రీనివాస్ గుప్తా,నాయకులు మేకల శ్రీకాంత్,బామండ్ల లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు.