గ్రావిూణ కులవృత్తులను ప్రోత్సహిస్తున్నాం

చేనేత ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పిస్తాం
చేనేత కార్మికులతో మంత్రి లోకేష్‌ ముఖాముఖి
వేటపాలెంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపనలు చేసిన మంత్రి
ఒంగోలు, జూన్‌19(జ‌నం సాక్షి): గ్రావిూణ కుల వృత్తులను ప్రోత్సహించేందుకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని ఏపీ ఐటీ, పంచాయతీరాజ్‌శాఖ మంత్రి లోకేష్‌ అన్నారు. శుక్రవారం ప్రకాశం జిల్లాలో ఏపీ మంత్రి నారా లోకేష్‌ పర్యటన కొనసాగుతోంది. చీరాలలో అభివృద్ధి కార్యక్రమాలకు మంత్రి శంకుస్థాపనలు చేశారు. ఆపై కొణిజేటిలో చేనేత కార్మికులతో మంత్రి లోకేష్‌ ముఖాముఖి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రావిూణ కులవృత్తులను ప్రోత్సహిస్తున్నామన్నారు. చేనేత ఉత్పత్తులకు మెరుగైన మార్కెటింగ్‌ సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. /ూష్ట్రంలో 25 ఎంపీ సీట్లు గెలిపిస్తే ప్రధానిని కూడా తామే నిర్ణయిస్తామని లోకేష్‌ అన్నారు. ప్రధాని మోదీని నిలదీసిన ఏకైక పార్టీ టీడీపీ అని తెలిపారు. ప్రతీ ఇంటికి తాగునీరందించే బాధ్యత తీసుకుంటానని చెప్పారు. సీఎం 68 ఏళ్ల వయస్సులో కూడా 24 ఏళ్ల యువకుడిలా పరిగెడుతూ రాష్టాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారని మంత్రి లోకేష్‌ అన్నారు. ఉదయం చీరాలలో పర్యటించిన మంత్రి లోకేష్‌ ప్రభుత్వాస్పత్రిలో రూ.2కోట్లతో నిర్మించిన విద్యుత్‌ సబ్‌స్టేషన్‌ను ప్రారంభించారు. అలాగే వేటపాలెం మండలం కొణిజేటి చేనేతపురి కాలనీలో రూ.1.34కోట్లతో నిర్మించనున్న సీసీ రోడ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. ఆపై రూ.9లక్షలతో నిర్మించనున్న అంగన్‌వాడీ భవనానికి మంత్రి లోకేష్‌ శంకుస్థాపన చేశారు.