గ్రీన్‌కార్డ్ కోసం భారతీయుల ఎదురుచూపులు
పిల్లల భవిష్యత్తు ఇబ్బందుల్లో పడుతుందని ఆందోళన
వాషింగ్టన్, జూన్7(జనం సాక్షి) : అమెరికాలో గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్న వారిలో భారతీయులే ఎక్కువ మంది. ఈ విషయం యూఎస్ సిటిజన్‌షిప్ అండ్ ఇమిగ్రేషన్ సర్వీసెస్ (యూఎస్‌సీఐఎస్) తాజాగా విడుదల చేసిన గణాంకాల ద్వారా వెల్లడైంది. మే 2018 నాటికి సుమారు 3,95,025 మంది విదేశీయులు అమెరికాలో శాశ్వత నివాసమైన గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్నారు. వీరిలో మూడొంతులకు పైగా భారతీయులే ఉన్నారు. అత్యుత్తమ నైపుణ్యం కలిగిన సుమారు 3,06,601మంది భారతీయులు గ్రీన్‌కార్డ్ కోసం ఎదురుచూస్తున్నట్లు యూఎస్‌సీఐఎస్ వెల్లడించింది. భారత్ తర్వాతి స్థానంలో చైనా (67,031) ఉండగా.. మిగతా దేశాల వాళ్లు పదివేలకు పైగా ఉన్నారు. అమెరికా ప్రభుత్వం అనుసరిస్తున్న నిబంధనల ప్రకారం ఒక ఆర్థిక సంవత్సరంలో ఏ దేశానికీ ఏడు శాతానికి మించి గ్రీన్‌కార్డులు జారీ చేయరాదు. దీని వల్ల భారతీయులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గ్రీన్‌కార్డ్ కోసం ఏళ్ల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. ప్రస్తుతం అమెరికాలో నివసిస్తున్న ఎక్కువ మంది భారతీయులు హెచ్-1బీ వీసాల విూద వచ్చిన వాళ్లే ఉన్నారు. ఒక దేశానికి ఏడు శాతం గ్రీన్ కార్డులు మాత్రమే జారీ చేయాలనే నిబంధన వల్ల భారతీయులు శాశ్వత నివాసం కోసం కొన్నేళ్ల పాటు ఎదురుచూడాల్సి వస్తుందనీ… ఈ పరిస్థితిలో మార్పు రావాల్సి ఉందని యూఎస్‌కు చెందిన కొందరు కాంగ్రెస్ నేతలు ఇప్పటికే ట్రంప్ ప్రభుత్వాన్ని కోరుతున్నారు.
/ారీన్‌కార్డుల కోసం ఏళ్ల తరబడి ఎదురుచూస్తున్న విధానంలో మార్పులు చేయాల్సిందిగా కోరుతూ పలువురు భారతీయులు ఇటీవల ఆందోళన చేశారు. ఉఅఖీ|/బినీసపబ.నీసణ ఇచ్చిన సమాచారం మేరకు భారతీయులు సుమారు 25ా92 ఏళ్ల పాటు గ్రీన్ కార్డు కోసం ఎదురుచూడాల్సి వస్తుంది. దీని వల్ల అక్కడ నివసిస్తున్న భారతీయుల పిల్లల భవిష్యత్ ఇబ్బందుల్లో పడుతుందని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.