గ్రీన్‌ఛాలెంజ్‌లో మొక్కలు నాటిన ఎమ్మెల్యే

నల్లగొండ,డిసెంబర్‌10(జ‌నంసాక్షి):గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ని నకిరేకల్‌ ఎమ్మెల్యే చిరుమర్తి లింగయ్య స్వీకరించి మొక్కలు నాటారు. టీఆర్‌ఎస్‌ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యులుజోగినపల్లి సంతోష్‌ కుమార్‌ జన్మదినం సందర్భంగా తుంగతుర్తి శాసనసభ్యులు గాదరి కిషోర్‌ కుమార్‌ గ్రీన్‌ ఇండియా ఛాలెంజ్‌ను స్వీకరించి నార్కట్‌ పల్లి పట్టణ కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయం ఆవరణలో మొక్కలు నాటి, మరో ముగ్గురు విద్యుత్‌ శాఖ మంత్రి గుంతకండ్ల జగదీష్‌ రెడ్డి, ఎమ్మెల్యే శానంపూడి సైదిరెడ్డి, కోదాడ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య లకు గ్రీన్‌ ఛాలెంజ్‌ విసిరారు.