గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల కోసం కాల్ సెంటర్ ఏర్పాటు
2373 మంది అభ్యర్థుల కోసం 9 పరీక్ష కేంద్రాలు
జిల్లా కలెక్టర్ భవిష్ మిశ్రా
భూపాలపల్లి బ్యూరో, అక్టోబర్ 12 (జనంసాక్షి):
అక్టోబర్ 16న తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ ద్వారా నిర్వహించు గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష కోసం జిల్లాలో కాల్ సెంటర్ ఏర్పాటు చేశామని కలెక్టర్ భవేష్ మిశ్రా తెలిపారు.బుధవారం గ్రూప్ 1 పరీక్షల నిర్వహణ కోసం జిల్లాలో చేసిన ఏర్పాట్ల పై కలెక్టర్ ఎస్పీతో కలిసి పాత్రికేయ సమావేశం నిర్వహించారు.
జిల్లా కలెక్టర్ భవేష్ మిశ్రా మాట్లాడుతూ, రాష్ట్ర సీఎస్ టెలీ కాన్ఫరెన్స్ ఆదేశాలు, టీఎస్పీఎస్సీ చైర్మన్ వీడియో కాన్ఫరెన్స్ ఆదేశాల నేపథ్యంలో భూపాల్ పల్లి జిల్లాలో గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షల నిర్వహణకు 9 కేంద్రాలను ఏర్పాటు చేశామని, 2373 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరవుతారని తెలిపారు. జిల్లాలో ఇప్పటి వరకు 70% వరకు అభ్యర్థులు తమ హాల్ టికెట్లను ఆన్ లైన్ నుండి డౌన్ లోడ్ చేసుకున్నారని, మిగిలిన అభ్యర్థులు సైతం వెంటనే tspsc.gov.in అనే వెబ్సైట్ ద్వారా తమ హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవాలని కలెక్టర్ సూచించారు. హాల్ టికెట్లలో పొరపాట్లు నమోదైతే సరిదిద్దుకునే అవకాశం ఉంటుందని, ఆలస్యమైతే ప్రక్రియ కష్టమవుతుందని కలెక్టర్ తెలిపారు. పరీక్ష కేంద్రాలకు వాచ్, షూ, పర్స్,హ్యాండ్ బ్యాగ్ లు, క్యాలిక్యులేటర్ వంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్స్ అనుమతించమని, బయో మెట్రిక్ విధానం ద్వారా అటెండెన్స్ ఉన్న నేపథ్యంలో అభ్యర్థులు ముందస్తుగా హాజరుకావాలని కలెక్టర్ సూచించారు. పరీక్ష కేంద్రాల ప్రాంగణాలలో సెల్ ఫోన్ అనుమతించమని జిల్లా కలెక్టర్ తెలిపారు. పరీక్ష కేంద్రాల్లో కి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులకు అనుమతి ఉండదని కలెక్టర్ తెలిపారు.
పరిక్షకు సంబంధించిన సందేహాల నివృత్తి కోసం జిల్లాలో ఏర్పాటు చేసిన కాల్ సెంటర్ నెంబర్ 9030632608 కు ఫోన్ చేయాలని కలెక్టర్ తెలిపారు.ఎస్పీ సురేందర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో ఉన్న 9 పరీక్ష కేంద్రాల వద్ద అవసరమైన మేర పోలీస్ బందోబస్తు కల్పిస్తామని అన్నారు. మహిళా అభ్యర్థులను చెక్ చేయడానికి కోసం ప్రతి పరీక్ష కేంద్రం వద్ద మహిళా పోలీసులు అందుబాటులో ఉంటారని పేర్కొన్నారు. పరీక్ష పత్రాల తరలింపు పోలిస్ ఎస్కార్ట్ ఉంటుందని తెలిపారు. ప్రతి పరీక్ష కేంద్రం వద్ద మెటల్ డిటెక్టర్ వినియోగిస్తూ తనిఖీ చేస్తామని తెలిపారు.
ఎస్పీ. సురేందర్ రెడ్డి, స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ టి.ఎస్. దివాకర, డి.పి.ఆర్.ఓ. వి.శ్రీధర్, సంబంధిత అధికారులు తదితరులు పాత్రికా సమావేశంలో పాల్గొన్నారు.