ఘట్కేసర్ లో ఓటర్ నమోదు కార్యక్రమం

ఘట్కేసర్ మున్సిపల్ లోని 33 పోలింగ్ స్టేషన్ల పరిధిలో తేదీ 26, 27 నవంబర్ మరియు డిసెంబర్ 3, 4 తేదీలలో 1 జనవరి 2023 వరకు 18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరూ ఓటర్ లిస్టులో పేరు నమోదు చేసుకొనుటకు స్పెషల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని ఈ అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలని కమిషనర్ వేమన రెడ్డి ఓటర్ నమోదు క్యాంపును పర్యవేక్షించిన సందర్భంగా తెలిపారు. 01 జనవరి 2023 నాటికి 18 సంవత్సరాలు నిండిన వారు 6-ఫామ్ దరఖాస్తు ద్వారా నూతన ఓటరు గా నమోదుచేయించుకోవాలని ఫామ్-8 దరఖాస్తు ద్వారా వయస్సు, చిరునామా,పేర్లలో పొరపాటు సవరణ చేయించుకోగలరని సూచించారు. ఓటరునమోదు కొరకు ఎన్నికల కమిషన్ మరొక అవకాశం కలిపిస్తూ 18 సంవత్సరాల వయస్సు నిండిన ప్రతి ఒక్కరు ఓటరు గా నమోదు చేసుకునేలా ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు, ఓటు హక్కును పొందేందుకు ఎన్నికల కమిషన్‌ అవకాశం కల్పించిందని, జనవరి 1, 2021 నాటికి 18 ఏళ్ల నిండిన ప్రతి ఒక్కరూ ఓటరుగా నమోదు చేసుకోవచ్చని, ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని మరియు సిబ్బందికి పోలింగ్ స్థాయి
జాబితాలో పేర్లు లేని వారు, కొత్తగా ఓటరు నమోదు కోసం, మార్పులు, చేర్పులు తదితర జాబితా సవరణపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. జాబితాలో సవరణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు ఓటరు నమోదు కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు పోలింగ్ బూత్‌లో ఓటరు నమోదు, జాబితాలో తప్పొప్పుల సవరణ, చనిపోయిన ఓటర్ల తొలగింపు, పోలింగ్‌ బూత్‌ల మార్పిడి, తదితరపనులు చేస్తారని అన్నారు. కొత్తగా ఓటరు జాబితాలో పేర్లు లేని వారు 18 సంవత్సరాలు నిండిన వారు ఆధార్‌కార్డు, రెండు పాస్పోర్టు సైజు ఫొటోలతో ఫారం నంబర్‌ 6ను పూర్తి చేసి పోలింగ్‌ బూత్‌లో సమర్పించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో మునిసిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.