ఘనంగా అంతర్జాతీయ బాలికల దినోత్సవం వేడుకలు.
చిట్యాల 11(జనంసాక్షి) మండల కేంద్రంలోని మోడల్ స్కూల్లోమంగళవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం వేడుకలు ఘనంగా నిర్వహించారు. బాలికల దినోత్సవంను పురస్కరించుకొని అంగన్వాడి సిడిపిఓ అవంతి ఆధ్వర్యంలో బాలికల భద్రత, రక్షణ, బాల్య వివాహాలు ,వృత్తి, విద్య, నైపుణ్యత తదితర అంశాలపై అవగాహన చేసి ప్రతిజ్ఞ చేయించారు. బాలలకు గల ఐదు హక్కులను ఐక్యరాజ్యసమితి బాలలకు కల్పించిందని ,ఈ హక్కులను కాపాడుకోవడానికి పిల్లలకు బాలల న్యాయ సంరక్షణ చట్టం, బాల కార్మికుల నిషేధం చట్టం, బాల్య వివాహాల చట్టం, అక్రమ రవాణా నిర్మూలన చట్టం, లైంగిక నేరాల నుండి బాలుల రక్షణ చట్టం, ఉచిత నిర్బంధ బాలల విద్యా చట్టం పిల్లల కోసం పనిచేస్తున్నవి. పిల్లలను కాపాడే ముఖ్యమైన విభాగాలు జిల్లా బాలల పరిరక్షణ వైసీపీఎస్ ,బాలల సంక్షేమ కమిటీ సిడబ్ల్యుసి బాలల న్యాయమండలి జేజేబి ప్రత్యేక బాలల పోలీస్ విభాగం, శిశు గృహ చైల్డ్ లైన్ పిల్లల కోసం శాఖలను ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. విద్యలో మంచి నైపుణ్యం సాధించాలని కోరారు ,ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ శేఖర్, గ్రామ సర్పంచ్ ఆకుల రవి ,ఎంపీటీసీ కట్కూరి పద్మ నరేందర్, అంగన్వాడీ సూపర్వైజర్ జయప్రద, టీచర్స్ భాగ్యలక్ష్మి, సంధ్యారాణి, జ్యోతి, భాగ్యమ్మ, అరుణ తదితరులు పాల్గొన్నారు.