ఘనంగా అంబేద్కర్‌ జయంతి

లక్సెట్టిపేట: భారత రాజ్యాంగనిర్మాత అంబేద్కర్‌ జయంతిని పలు పార్టీలు, ప్రజా సంఘాలు, దళితసంఘాల ఆద్వర్యంలో ఆదివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణంలోని ఉత్కూరు చౌరస్తావద్ద గల అంబేద్కర్‌ విగ్రహానికి పలువురు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మండల పరిషత్‌ హాలులో ఏర్పాటు చేసిన కార్యాక్రమంలో తాసీల్దారు రమేశ్‌బాబు మాట్లాడుతూ దళితుల అభ్యున్నతికి అంబేద్కర్‌ సేవలను కొనియాడారు. ఎంపీడీవో, ఆయా సంఘాల నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారు.