ఘనంగా అంబేద్కర్ వేడుకలు
నెన్నెల: నెన్నెల మండలంలో అంబేద్కర్ జయంతి వేడుకలను ప్రభుత్వ కార్యాలయాల్లోనూ, ఆయా సంఘాల ఆధ్వర్యంలో ఘనంగా జరిపారు. మండల పరిషత్ కార్యాలయంలో కార్యాలయ పర్యవేక్షకుడు శేషుకుమార్ ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో రెవెన్యూ అధికారులు దిగంబర్, పంచాయితీ కార్యదర్శి పద్మనాభం, కుల సంఘాల ఐక్యవేదిక నాయకులు తదితరులు పాల్గొన్నారు.