ఘనంగా అబుల్ కలామ్ ఆజాద్ 134 వ జయంతి.


బెల్లంపల్లి, నవంబర్ 11, (జనంసాక్షి )
బెల్లంపల్లి పట్టణం 18వ వార్డు శంశీర్ నగర్ లో శుక్రవారం ఆల్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ మరియు ఆల్ ముస్లిం మైనార్టీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో మౌలానా అబుల్ కాలం ఆజాద్ 134 వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈకార్యక్రమంలో ముఖ్య అతిధిగా గౌస్ ఉల్ వారా మస్జీద్(సదర్ సాబ్)అధ్యక్షులు యండి అఫ్జాల్ బాబా, ఆల్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు అన్వర్ ఖాన్ మాట్లాడుతూ మౌలానా అబుల్ కాలం ఆజాద్ గారు మక్కలో 1888 నవంబర్ 11లో జన్మించి 10 వ యేటా తన తండ్రితో కలకత్తా కు వచ్చారని, తన విద్యను కలకత్తా లో ప్రారంభించారని అన్నారు. 1905లో ఉన్నత విద్య కోసం ఈజిప్ట్ కేయిరిలో అజహాస్ విశ్వవిద్యాలయనికి వెళ్లారని 1908లో భారతదేశానికి తిరిగి వచ్చి జాతీయ స్వాతంత్ర ఉద్యమంలో పాల్గొన్నారన్నారు.
అబుల్ కాలం మహాత్మగాంధీకి ముఖ్య అనుచరుడిగా ఉంటూ బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా అనేక ఉద్యమాల్లో పాల్గొన్నారని అన్నారు. భారతదేశ విముక్తి కోసం అనేక పర్యాయాలు జైలుశిక్ష ను అనుభవించారని, 1947లో భారత స్వాతంత్ర్యం తర్వాత 1958 వరకు విద్యశాఖ మంత్రిగా ఉన్నారని, ఆల్ హి లాల్ అనే పత్రికను నడుపడమే కాకుండా భారత దేశం స్వాతంత్ర్యన్ని సంపాదించును అనే గ్రంధాన్ని రచించారని అన్నారు. స్వాతంత్ర ఉద్యమంలో అయన చేసిన సేవలను కొనియాడారు.
ఈ కార్యక్రమంలో ఖ్వాజ మొయినుద్దీన్, రసూల్ షరీఫ్, యండి ముస్తఫా, యండి గౌస్, రషీద్ ఖాన్, ఫెరోజ్ ఖాన్, అహ్మద్, షాదఫ్ తదితరులు పాల్గొన్నారు.