ఘనంగా ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ జయంతి వేడుకలు
ధర్మపురి (జనం సాక్షి న్యూస్) స్వాతంత్ర్య సమరయోధుడు తెలంగాణ పోరాటయోధుడు ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ 107వ, జయంతి వేడుకలు మంగళవారం ఉదయం మండల పరిషత్ కార్యాలయం,ధర్మపురిలో ఘన నివాళులు అర్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో మండల పరిషత్ అధ్యక్షుడు ఎడ్ల చిట్టిబాబు,జిల్లా ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు బత్తిని అరుణ, డీసీఎంఎస్ చైర్మన్ ఎల్లాల శ్రీకాంత్ రెడ్డి,చైర్మన్ అయ్యోరి రాజేష్, వైస్ యం.పి.పి.గడ్డం మహిపాల్ రెడ్డి,తిమ్మాపూర్ ఎంపీటీసీ కాళ్ళ సత్తయ్య,మరియు కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.