ఘనంగా ఈద్ మిలాద్ ఉన్ నబీ

బెల్లంపల్లి, అక్టోబర్ 9, (జనంసాక్షి)
బెల్లంపల్లి పట్టణంలో ఆదివారం మిలాద్ ఉన్ నబీ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ముస్లిం మార్గదర్శకుడు ఇస్లాం దివ్య గ్రంధం ఖురాన్ ను యావత్ మానవాళికి అందించిన మహోన్నత పురుషుడు ఆదర్శనీయులైన ముహమ్మద్ ప్రవక్త సల్లల్లాహు అలైహివ సల్లమ్ యొక్క జన్మదినోత్సవం ( ఈద్ మిలాద్ ఉన్ నబీ ) సందర్బంగా
ఆల్ ముస్లిం మైనార్టీ వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ మరియు ఆల్ ముస్లిం మైనార్టీ యూత్ కమిటీ ఆధ్వర్యంలో బెల్లంపల్లి ప్రభుత్వ ఆసుపత్రి లో రోగులకు అన్నదానం మరియు బట్టలు పంపిణి చేశారు.
ఈ కార్యక్రమంలో ముఖ్యఅతిధులు యం.ఎ అజీజ్, డాక్టర్ టీ. సిద్దార్థ్, బి. సంధ్య, ఆల్ ముస్లిం మైనారిటీ వెల్ఫేర్ జాయింట్ యాక్షన్ కమిటీ రాష్ట్ర అధ్యక్షులు అన్వర్ ఖాన్, ఖ్వాజ మొయినుద్దీన్, రసూల్ షరీఫ్, యండి జాఫర్, ఫెరోజ్ ఖాన్, షైక్ అఫ్రోజ్, సయ్యద్ ఆయన్ తదితరులు పాల్గొన్నారు.