ఘనంగా ఈస్టర్
రామకృష్ణాపూర్, న్యూస్‌లైన్: ఏసుక్రీస్తు పునరుత్ధానం సందర్భంగా నిర్వహించే ఈస్టర్ వేడుకలను రామకృష్ణాపూర్‌లో ఆదివారం ఘనంగా నిర్వహించారు. వేకువజామునే ప్రారంభమైన ఈ ప్రత్యేక దైవారాధనకు ఆదిలాబాద్ డయాసిస్ హెచ్‌ఆర్‌డీ డైరెక్టర్ ఫాదర్ కురియన్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. మరణాన్ని జయించి పునరుత్థానుడైన ఏసుక్రీస్తు నిత్యజీవితానికి తొలి మెట్టు వేశారని అన్నారు. ప్రేమ పవిత్రత, క్షమాపణ తదితర మానవీయ విలువలు బోధించిన ఏసు జీవన విధానం అనుసరణీయమన్నారు. స్థానిక సీఎస్‌ఐ సెయింట్ పీటర్స్ చర్చిలో జరిగిన ఈస్టర్ వేడుకల్లో పెద్దపల్లి ఎంపీ.జి.వివేకానంద పాల్గొని ప్రార్థనలు చేశారు. చర్చి కమ్యూనిటీ హాల్ అభివృద్ధి పనుల నిమిత్తం రూ. 75 వేలు ప్రకటించారు. కార్యక్రమంలో చర్చి రెసిడెంట్ ప్రెసిడెంట్ రెవరెండ్ అశోక్, కార్యదర్శి డొల్కల డేవిడ్ పాల్గొన్నారు.